మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు గణతంత్య దినోత్సవం కావడంతో టీజర్ విడుదల చేస్తారని అందరూ వేయికళ్లతో చూస్తున్నారు. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడంతో చిరు అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ అందించారు. ఆచార్య టీజర్ అప్‌డేట్ రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రకటన మెగాస్టార్ కాస్తా వినూత్నంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో చిరంజీవి, కొరటాల శివ మధ్య టీజర్ విడుదల ఎప్పుడన్న విషయంపై సరదా సంభాషణ జరుగుతున్నట్లు వివరించారు