హైదరాబాద్:
◆ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు.
◆ ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది థీమ్ ‘అమెరికన్ ఇండిపెండెన్స్’కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుని, షేన్ పీకాక్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు.
◆ దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. మెట్ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈఏడాది భారత్ నుంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం.