తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఫ్లిప్ హెల్త్ యాప్ దోహదపడుతుందని సంస్థ సీఈవో విష్ణు కళ్యాణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్లిప్ హెల్త్ యాప్ విశేషాలను వివరించారు. కుత్రిమ మేధస్సు తో యాప్ పనిచేస్తుందని, ఇందులో 200 రకాల వ్యాధులు, 700 వందల రకాల వైద్య పరీక్షలను రూ 100 రూపాయలు పొందవచ్చునని చెప్పారు. అదేవిధంగా అనుభవజ్ఞులైన 18 మంది వైద్య నిపుణులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అనంతరం చికిత్సలు సైతం సూచిస్తారని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఆక్సిజన్, హార్ట్ బీట్, బ్లడ్ ప్రెజర్ పరీక్షించుకోవచ్చునని తెలిపారు. లక్ష మంది పై ప్రయోగాలు నిర్వహించడం ద్వారా 97 శాతం ఫలితాలు వచ్చాయని తెలిపారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి యాప్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. నేటి నుంచి ప్లేస్టోర్ లో తమ యాప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సి ఓ ఓ సుక్విందర్ సింగ్, సి ఎ ఏ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.