*దేశీయంగా ఒక లక్ష ట్రాక్టర్ల అమ్మకాలు మైలురాయి అధిగమించింది మరియు కేవలం 11 నెలల్లో అత్యధిక అమ్మకాల మైలురాయినీ అధిగమించింది
ప్రతినెలా అత్యధిక వృద్ధిని 2021 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేస్తూ, దానిని ఓ ధోరణిగా మార్చుకున్న సోనాలికా ట్రాక్టర్స్ ఇప్పుడు కేవలం 11 నెలల్లో 1,06,432 ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడం ద్వారా నూతన రికార్డులను సృష్టించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 35.5% వృద్ధిని సోనాలికా నమోదు చేసింది. తద్వారా భారతదేశంలో మరే ఇతర ట్రాక్టర్ బ్రాండ్ కూడా సాధించలేనటువంటి రీతిలో తాము కార్యకలాపాలు ఆరంభించిన తరువాత అత్యంత వేగంగా ఒక లక్ష దేశీయ ట్రాక్టర్ల విక్రయాలను జరిపిన రికార్డు నెలకొల్పింది. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ట్రాక్టర్ తయారీదారునిగా మరియు నెంబర్ 1 ట్రాక్టర్ ఎగుమతి బ్రాండ్‌గా నిలిచిన సోనాలికా, మొత్తంమ్మీద ఫిబ్రవరి 2021లో 11,821 ట్రాక్టర్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే నెలలో కేవలం 9650 ట్రాక్టర్లను మాత్రమే విక్రయించింది.
ఈ అసాధారణ మైలురాయిని సాధించిన సందర్భంగా సోనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమణ్ మిట్టల్ మాట్లాడుతూ ‘‘కేవలం 11 నెలల్లో గత సంవత్సరంతో పోలిస్తే 35.5% వృద్ధితో మొత్తంమ్మీద 1,06,432 ట్రాక్టర్లను విక్రయించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే 11 నెలల కాలంలో మరే ఇతర ట్రాక్టర్ బ్రాండ్ సాధించనటువంటి రీతిలో ఈ రికార్డును సాధించడం. ఇది రైతులు మా పట్ల చూపుతున్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. 2021 ఆర్థిక సంవత్సరమంతటా కూడా ఒక నెలకు మించిన ప్రదర్శనను మరో నెలలో సోనాలికాచేసింది. అత్యాధునికమైనప్పటికీ అందుబాటు ధరలలోని సాంకేతికతలతో కస్టమైజ్డ్ ట్రాక్టర్లను సమయానుకూలంగా ఆవిష్కరించాలనే మా వ్యూహం దీనికి తోడ్పడింది’’ అని అన్నారు.