తలసానికి “తల నొప్పి”
- –ఆగని కార్పొరేటర్ల వసూళ్ల పర్వం.
- – క్షేత్ర స్థాయిలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి.
- – మంత్రి మంచోడే…..కింది లీడర్ల దోపిడీ ఎక్కువైంది.
- – సనత్ నగర్ వాసుల్లో అంతర్మధనం.
- – రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం.
తలసాని శ్రీనివాస్ యాదవ్…. గ్రేటర్ హైదరాబాద్ లో తిరుగు లేని నాయకుడు ఆయన……నగర రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తున్న ఆయనకు తన సొంత నియోజకవర్గం లో నేతల తీరు తల నొప్పిగా మారింది…… సొంత పార్టీ కార్పొరేటర్లు చేస్తున్న అవినీతి, అక్రమాలు ఆయనకు సవాలుగా మారాయి. వారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలతో క్షేత్ర స్థాయిలో అసంతృప్తి పెల్లుబికుతోంది. రాబోయే ఎన్నికల వరకు అసంతృప్తి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది .
నగరం లో టిఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని భుజాన వేసుకొని విజయవంతం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా, నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సొంత నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల వ్యవహార శైలి తలనొప్పి తెప్పిస్తోంది. నియోజకవర్గం లోని కొన్ని డివిజన్ కు చెందిన సొంత పార్టీ నేతలు, కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తల ఆగడాలు శృతి మించడం పలు విమర్శలకు దారి తీస్తుంది. సనత్ నగర్ డివిజన్ తో పాటు అమీర్పేట్ డివిజన్ లలో కొందరు నేతలు మంత్రి పేరు చెప్పి స్థలాలను అక్రమించుకున్నారు అన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి, స్థలాలు, తక్కువ ధరలకు భవనాలు కొనుగోలు చేయడంలో ఎంతో “ప్రావీణ్యం” ఉన్న ఒక నేత వ్యవహారం ఇప్పటికే పత్రికలకు ఎక్కి మచ్చలేని మంత్రికి కాస్త తలనొప్పి ని తెచ్చి పెట్టిన విషయం విదితమే.
ఇక పక్క డివిజన్ కార్పొరేటర్ భర్త వ్యవహార శైలిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయిన్నాయి.ఇల్లు కట్టాలంటే ఈయన ఆశీర్వాదం కావాల్సిందే. ఇటీవల తన బార్ అండ్ రెస్టారెంట్ కోసం ఏకంగా ఫుట్ పాత్ ని అక్రమించుకొని లిఫ్ట్ ఏర్పాటు చేయడం అయన అహంకారానికి నిదర్శనం. వీరితో పాటు కొందరు చోటా మోటా గల్లీ లీడర్లు కూడా తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకరికి మించి ఒకరు భవనాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు మంత్రికి చికాకు తెప్పిస్తుట్లు తెలుస్తుంది.
నగరంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి సనత్ నగర్ లో చేసి చూపించి నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొందరు కార్పొరేటర్లు అనుసరిస్తున్న తీరు ఆయనకు మైనస్ గా మారుతోందని భావిస్తున్నారు. ఇప్పటికైనా కొందరు నేతలు తమ తీరు మార్చుకోక పోతే రాబోయే ఎన్నికల్లో నష్టం తప్పదని పలువురు భావిస్తున్నారు.- మంత్రి మంచోడే…… కింది స్థాయి లీడర్ల దోపిడీ ఎక్కువైందిమంత్రి మంచోడే కానీ కింది స్థాయి లీడర్ల దోపిడీ ఎక్కువైంది.
ఇది సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్న మాట. మా వాడకు శీనన్న రోడ్డేయించారని ఒకరంటే, మా గల్లీల సార్ డ్రెయినేజీ కట్టించారని మరొకరు…. నియోజకవర్గం లో మెజార్టీ ప్రజలు మంత్రి మంచోడని కితాబునిస్తున్నప్పటికికార్పొరేటర్లు, కింది స్థాయి లీడర్లు అనుసరిస్తున్న తీరు మంత్రికి మచ్చ తెచ్చే విధంగా ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి.తలసాని ఆశీర్వాదం తో గెలుపొందిన కొందరు కార్పొరేటర్లు, గద్దెనెక్కి తమ పదవులకు ఇంకా మూడేళ్లు సమయం ఉందన్న ధీమాతో ఉన్నట్టు వ్యవరిస్తున్నారు, రాబోయే ఎన్నికలు మావి కాదు కదా,ఎం ఎల్ ఏ ఎన్నికలతో మాకేం పని అన్నట్టు వ్యవరిస్తూ అందినకాడికి దోచుకోవడం చేస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి, కొన్ని సార్లు స్థానిక ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టి కి తీసుకెళ్లి ప్రయత్నం చేసినప్పుడు కొందరు నేతలు, కార్పొరేటర్లు అడ్డుకుంటూ ఉన్నారని తెలుస్తుంది, పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎన్నికలకు ఈ నేతలు మంత్రి గెలుపుకు ఎంత మేర కృషి చేస్తారన్నా విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఇప్పటికే గత కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రి నిలబెట్టిన ఒక మాజీ మహిళా కార్పొరేటర్ ని ఒక వర్గం తెర వెనుక కుట్ర చేసి ఓడించారు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి, ఐతే ఈ కుట్ర బ్యాచ్ వ్యవహారం పై మంత్రి ద్రుష్టి పెట్టాలి అని అసలు సిసలు మంత్రి అభిమానులు కోరుతున్నారు.