మీ”ఢీ'”యా వార్


రసవత్తరంగా జూబ్లీ హిల్స్ socity ఎన్నికలు
ఆసక్తి రేపుతున్న ఉద్దండుల పోరు
కొందరి గుత్తాదిపత్యం పై కమిటీ సభ్యుల అసంతృప్తి.

జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో మీ”ఢీ”యా వార్ మొదలైంది. తలపండిన ఉద్దండులు ఇరువర్గాలుగా చేరి జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల బరిలో పోటాపోటీగా నిలిచేందుకు సిద్ధం అవుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.. వీరిలో ప్రధాన పోటీ రెండు మీడియా సంస్థలు యజమానుల మధ్య కొనసాగే అవకాశం ఉంది, ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి,టీవీ5 చానెల్ అధినేత నాయుడు మధ్య పచగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయి విబేధాలు చోటు చేసుకున్నాయి,ఇప్పటికే క్లబ్ లో పాగా వేసుకొని కూర్చున్న ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి అసలు ఎన్నికలే జరగకుండా ఉండేందుకు చక్రం తిప్పారు, కానీ ప్రత్యర్థి వర్గం ఎన్నికలు జరిగి తీరాలని పట్టుబట్టి కోర్ట్ ని అష్రయించడంతో ఎన్నికల నగారా మోగింది,దీంతో ఆధిపత్యం కోసం ఒక వర్గం.. బరిలోకి దిగి గెలుపు కోసం మరో వర్గం నిజమైన ఎన్నికల రణరంగాన్ని తలపించేందుకు సిద్దమవుతుంది.. గత కొద్ది రోజులుగా సొసైటీలో చోటు చేసుకుంటున్న సంఘటనలపై “ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క” అనే రీతిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రముఖుల చూపంతా ఇప్పుడు ఈ ఎన్నికల వైపే మారింది..

3వేల ఎకరాల సొసైటీ.. 5200 మంది సభ్యులు.. లక్షల్లో పలికే గజం భూమి ధరలు…..కోట్ల విలువైన భూములు కలిగి ఉన్న ఈ సోసిటీ చరిత్ర అంత ఇంత కాదు, ఇక్కడ ఈ సోసిటీ కి చెందిన క్లబ్ లో సభ్యత్వం కలిగి ఉండటం స్టేటస్ సింబల్ గా భావిస్తారు బడా బాబులు,ఐతే సోసిటీ నిబంధనల ప్రకారం ప్రతి ఐదు ఏళ్ళకి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది,కానీ గత పదేళ్లుగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి

ఎన్నికలు కరపకుండా ఏక గ్రీవంగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు,ఈయన ఆధిపత్యం ఇలా కొనసాగుతున్న సమయంలో టీవీ5 సంస్థ జూబ్లీహిల్స్ లో నూతన కార్యాలయ నిర్మాణం చేపట్టింది,ఐతే చౌదరి ఈ నిర్మాణ పనులను అడ్డుకున్నారని,తమను ఇబ్బంది పెడుతున్నారని టీవీ5 నాయుడు అప్పట్లో ఆరోపించారు,ఈ గొడవ ముదిరి నేడు సొసైటీ ఎన్నికలో నువ్వా నేనా అనే స్థాయు కి పోరాటం మొదలు ఇయ్యింది ,గత ఆరు నెలలుగా ఈ రెండు మీడియా సంస్థ ల యజమానులు సొసైటీ కార్యాలయం వద్ద,జూబ్లీహిల్స్ క్లబ్ వద్ద పదుల సంఖ్యలో తమ మనుషులను కాపలా పెట్టి జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడి తెల్సుకుంటు,దానికి తగ్గట్టు గా పావులు కదుపుతున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు, వాస్తవానికి ఈ సొసైటీ సభ్యుల్లో చాలా మంది బడా బాబులు తీరిక లేకుండా తమ వ్యాపారంలో మునిగి తెలుతో ఉంటారు,ఈ ఎన్నికలను పట్టించుకునే సమయం కూడా ఉండదు,కానీ గత కొద్ది ఏళ్లుగా ప్రస్తుతం కమిటీ లో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఉద్దేశ్య పూర్వకంగా బెదిరింపులలకు పడం, డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు,విలువైన ఫ్లాట్స్ లో నిర్మాణ పనులను అడ్డుకోవడం లాంటి పనులకు పాల్పడ్డారని కొందరు కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు, కేవలం ఇద్దరి పాలక వర్గం సభ్యుల ఆధిపత్యం వల్లే ఈ సారి ఎన్నికలు రసవత్తరగా మరనున్నట్టు తెలుస్తుంది,ఇదంతా ఒక ఎత్తు ఐతే ఈ మీడియా సంస్థల మధ్య పోరు కొందరు బడా బాబులకు తల నొప్పీలు తెచ్చి పెడ్తున్నాయి,పోటీ పడుతున్న రెండు మీడియా సంస్థల మధ్య నలిగిపోతున్నారురు,ఎవరి మద్దతు ఇచ్చిన ఇంకొకరికి కోపం వచ్చి తమ వ్యాపరాలపై ఎలాంటి ప్రచారం చేస్తారో అని లోలోన ఆందోళన పడ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *