NTR

హీరో నవీన్ పొలిశెట్టి చివరిగా 'జాతిరత్నాలు' చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. దాని తరువాత,మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.హీరోయిన్ అనుష్క శెట్టి తో కలిసి నటించిన కొత్త మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'.ఈ మూవీకి మహేష్.పి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తుంది.ఈ సందర్భంగా యూనిట్ వరసగా అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. పోస్టర్లు,రీసెంట్ గా వచ్చిన టీజర్ మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి.

మరోవైపు యూనిట్ మ్యూజిక్ పరంగానూ,టీజర్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.ఇప్పుడు సాంగ్స్ తోనూ ఆకట్టుకుంటుంది మూవీ యూనిట్. రెండు నెలల కింద 'నో నో నో' అనే టైటిల్ లో ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చిత్రం నుండి రెండో పాటను కూడా విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ ను మేకర్స్, తమిళ హీరో ధనుష్ తో పాడించడటం విశేషం. ధనుష్ గతంలో ఎన్నో సాంగ్స్ ని పాడి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సింగర్ గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' నుంచి రెండో సాంగ్ ను 'హత విధి' అనే టైటిల్ తో విడుదల చేశారు. ఈ లిరికల్ సాంగ్ ను తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేశారు.రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కు, ధనుష్ అద్భుతమైన వాయిస్ జాతపరిచారు. రధన్ క్యాచీ టూన్ తో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ లవర్స్ కు ఈ సాంగ్ బాగా నచ్చుతుంది. ప్రస్తుతం యూట్యూబ్ లోనూ ట్రెండింగ్ అవుతుంది ఈ సాంగ్.

లిరికల్ వీడియోలో,సినిమాలో హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్ లో ఏదీ గొప్పగా చేయాలనుకున్న అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్ తో సాంగ్ కొనసాగింది. తనకు ఎదురవుతున్న సంఘటనలతో నవీన్ ఎంత నిరుత్సాహానికి లోనవుతాడు అనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించబోతున్నారని అర్థం అవుతుంది.

ధనుష్ గొంతు, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాటు సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. మరో విశేషం ఏమిటి అంటే ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఈ సాంగ్ కి ఏదో ఒక లిరిక్ దగ్గర తమ లైఫ్ గుర్తు చేసుకోక మానరు. ఇక మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా అలరించబోతున్నారు. అనుష్క చెఫ్ గా కనిపించబోతుంది. వీరిద్దరూ వేరే వేరే దేశాలలో ఉంటారు, అలాంటప్పుడు వీరి మధ్య బంధం ఎలా కుదురుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీని,యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.