
యంగ్ హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ తీసిన 'హనుమాన్' సినిమా ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఇక దీపావళి సందర్భంగా ఇటీవల ప్రశాంత్ వర్మ ఓ సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. కన్నడ స్టార్, కాంతార ఫేమ్ హీరో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రిషబ్ శెట్టిని హనుమంతుడిగా చూసి ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇదే ఊపులో మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు డైరెక్టర్.
ఆ స్టార్ హీరో కూడా
తాజాగా ప్రశాంత్ వర్మ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరో రానా, రిషబ్ శెట్టితో కలిసి దిగిన ఫొటోను ప్రశాంత్ వర్మ షేర్ చేశారు. దీనికి 'జై జై హనుమాన్' అనే క్యాప్షన్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. అంతేకాకుండా రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.