ఓరి నాయనో.. ఇదేం లైనప్‌రా బాబు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే

పది, ఇరవై ఏళ్లకు ముందు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక్క సినిమాను తీసుకు రావడం కోసం హీరోలు కష్టపడుతున్నారు. దాదాపు అందరు హీరోలు భారీ బడ్జెట్, పాన్ ఇండియా మోజులో పడి రెండు, మూడేళ్లకు ఒక సినిమాను వదలుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. రెండు మూడు సెట్స్ మీద ఉండగా.. ఇంకో రెండు మూడు ప్రాజెక్టులను ఓకే చేసుకుంటున్నాడనిపిస్తోంది
.
బాహుబలి సినిమాతో పాటు ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్‌ సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత నుంచి చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఏడాదికి రెండు సినిమాలు తీసుకు వస్తానంటూ ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడి వరుసగా సినిమాలు కమిట్‌ అవుతూ అవి ఎంత భారీ బడ్జెట్‌ సినిమాలైనా ఏడాదికి రెండు సినిమాలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తక్కువ గ్యాప్‌లోనే సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలు వచ్చాయి. వచ్చే ఏడాది సమ్మర్‌ కి ప్రభాస్ నుంచి రాజాసాబ్‌ రాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాదిలోనే హను రాఘవపూడి సినిమా సైతం విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి.