IND vs BAN 1st 20I Match Report: అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..

India vs Bangladesh, 1st T20I: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది.

భారత్ తరపున అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీశారు. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ తలో 29 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 39 పరుగులు చేసి మ్యాచ్ ముగించాడు. తొలి టీ20లో విజయం సాధించి సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది.