
కిరణ్ అబ్బవరం గత రెండు వారాలుగా వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, షార్ట్ ఫిల్మ్స్ లు చేస్తూ హీరోగా అవకాశాలు దక్కించుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఇంత కష్టపడి వచ్చి తనను కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారని, ఒక సినిమాలో తనను ట్రోల్ చేయడం బాధగా అనిపించిందని కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ అందరినీ టచ్ చేసింది. ఇటీవల జరిగిన 'క' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ తన చిన్నతనం నుంచీ పడ్డ కష్టాలను చెబుతూ ఇచ్చిన స్పీచుకు అందరూ ఎమోషనల్ అయ్యారు.
2019లో రాజావారు రాణిగారు సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన కిరణ్ అబ్బవరం అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ వచ్చిన కిరణ్ అబ్బవరం సక్సెస్ కంటే ఫ్లాప్స్‌ని ఎక్కువగా చవి చూడటం జరిగింది. దాంతో కిరణ్ అబ్బవరం సినిమాలు ఎక్కువ చేస్తారు కానీ సక్సెస్‌లు రావనే అభిప్రాయం పడిపోయింది. కొన్ని సినిమాలను కిరణ్ అబ్బవరం ఎందుకు చేశాడనే విమర్శలు వచ్చాయి. అందుకే ఏడాది గ్యాప్ తీసుకుని ఒక మంచి సినిమాతో రావాలని భావించిన కిరణ్ అబ్బవరం అన్నట్లుగానే ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అయిన 'క' తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'క' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.