విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి.. ఆనంద్‌కి క్రెడిట్స్ ఇచ్చిన హీరోయిన్

విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ ఎప్పుడూ గ్రాండ్‌గానే జరుగుతుంటాయి. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా దీపావళి ఫోటోల కోసం ఎదురుచూస్తుంటారు. ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ దీపావళిని సెలెబ్రేట్ చేసుకునేందుకు చాలా వరకు ప్రయత్నిస్తుంటాడు. దీపావళి టైంకి షూటింగ్‌లు పెట్టుకోకుండా.. అమ్మా, నాన్న, తమ్ముడితో గడిపేందుకు చూస్తుంటాడు. అయితే గత రెండు, మూడు ఏళ్ల నుంచి విజయ్ దీపావళి సెలెబ్రేషన్స్ మీద ఎక్కువగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. విజయ్ ఇంట్లో జరిగే దీపావళి వేడుకల్లో రష్మిక కూడా ఉంటుందని చర్చలు నెట్టింట్లో జరుగుతూ వచ్చాయి.

విజయ్, రష్మికలు డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉంటాయి. కలిసి వెకేషన్లో ఉన్నారని కోడింగ్ చేసి ఏదో కనిపెట్టినట్టుగా అన్నీ కనిపెట్టి మరీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. వీరిద్దరి టాపిక్ నేషనల్ వైడ్‌గా చర్చలు జరుగుతూనే ఉంటాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కబుర్లు కూడా చెబుతారని ఓ వైపు వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని విజయ్, రష్మికలు చెబుతుంటారు.