అతి ఉత్సాహం వలన చిక్కుల్లో పడిన కోహ్లీ

RCB రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై జరిమానా విధించారు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మైదానంలో రూల్స్ ని  తప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివమ్ దూబె ఔటైన సమయంలో అతిగా సంబరాలు చేసుకుంటూ నోరు జారాడు, ఆ కారణంతో రిఫరీ అతడి మ్యాచ్ ఫీజులో  10% కోత పడింది. విరాట్ కోహ్లీ గాల్లోకి పంచ్‌లు విసురుతూ అతిగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను నోరు కూడా జారినట్లు తెలుస్తోంది.  
        
         మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. చివర్లో చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు 218/8కే పరిమితమైంది. 

  • xl0b5k