దటీజ్‌ రేవంత్‌

దటీజ్‌ రేవంత్‌

  • బీజేపీపై విమర్శలతో కాంగ్రెస్‌కు మైలేజీ తెచ్చిన సీఎం.
  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా రేవంత్‌ వ్యాఖ్యలు.
  • ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినా బెదరని వైనం.
  • అటు బీజేపీ..ఇటు కేసీఆర్‌పై పదునైన విమర్శలు.
  • ప్రచారంలో దూసుకుపోతూ..విజయం వైపు పరుగులు.

మళ్లీ రేవంత్‌ ‘టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌’ అయ్యాడు. ఎన్నికలకు పన్నెండు రోజుల ముందు ఆయన దేశవ్యాప‍్తంగా చర్చనీయాంశమయ్యాడు. స్థానిక మీడియాతోపాటు జాతీయ మీడియాలోనూ బిగ్‌ న్యూస్‌గా మారాడు. ఇందుకు కారణం..రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు. బీజేపీని టార్గెట్‌ చేస్తూ చేసిన ఫైర్‌బ్రాండ్‌ విమర్శలే. అసెంబ్లీ ఎన్నికల ముందే కాకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీని..ముఖ్యంగా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ..డైనమిక్‌గా స్పీచ్‌లు ఇస్తూ..అద్భుతమైన తన వాక్పటిమ..దుందుడుకుతనంతో సెన్సేషనల్‌గా మారారు రేవంత్‌రెడ్డి. అనంతరం ఆయన ఆ దుందుడుకుతనాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌ పార్టీలో స్టార్‌గా ఎదిగారు. ఎంతో మంది సీనియర్లను కాదని..ఢిల్లీ పెద్దల దృష్టిలో అసెంబ్లీ ఎన్నికల నాయకుడు రేవంతే అని తీర్మానించేలా చేశాడు. అందుకు తగ్గట్లుగానే..ఢిల్లీ పెద్దల నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. ఏకంగా సీఎం పీఠం అధిష్టించాడు.

అసలు సిసలు సవాల్‌:

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి..రేవంత్‌ సీఎం పీఠమెక్కిన తర్వాత నాలుగు నెలలకు దేశంలోనే కీలకమైన పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి. ఇవి రేవంత్‌కు సవాల్‌తో కూడుకున‍్నవి. ఈ దశంలో ఆయన తన చరిష్మాను కొనసాగించి పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ తన హవా కొనసాగిస్తాడని అందరూ అంచనా వేశారు. కానీ..ఈ మధ్యకాలంలో కొంత అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ ఇటు ప్రతిపక్ష పార్టీలు…అటు కేసీఆర్‌ అనుకూల మీడియా ప్లాన్‌ ప్రకారం విమర్శలు గుప్పించారు. ఆయనను ఏకాకిని చేసే యత్నాలు జరిగాయి. సొంత పార్టీలోనూ కొంత స్తబ్ధత నెలకొన్న పరిస్థితుల్లో కాస్త ఆలస్యంగా రేవంత్‌ పార్లమెంట్‌ ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఊపు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేదనే టాక్‌ విన్పించింది. కానీ అనూహ్యంగా రేవంత్‌రెడ్డి ఇప్పుడు విజృంభిస్తున్నారు. అన్ని అవరోధాలను అధిగమించి పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సమయం తక్కువగా ఉండడంతో పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అయిన కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశాన్ని హైలెట్‌ చేస్తూ అన్ని ప్రచార సభల్లోనూ బీజేపీని విమర్శిస్తున్నారు. దీంతో కేంద్రం అలర్ట్‌ అయింది. రేవంత్‌రెడ్డిపై ఏకంగా కేసులు నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చారు. అమిత్‌షాపై తప్పుడు ఆరోపణలు చేశారన్నది రేవంత్‌పై ప్రధాన ఆరోపణ. కాగా తాను ఎలాంటి బెదిరింపులకు బెదరనని రేవంత్‌ స్పష్టం చేస్తున్నారు. ముమ్మాటికీ అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌లు అభివృద్ధి నిరోధకులని విమర్శిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా రేవంత్‌కు నోటీసుల అంశం చర్చనీయాంశమైంది. ఇటు రాష్ట్రంలోనూ ఆయనకు మంచి మైలేజీ వచ్చింది.

కార్నర్‌ మీటింగ్‌లతో వెరీ బిజీ:

రేవంత్‌ డైనమిక్‌గా వ్యవహరిస్తేనే ప్రజాదరణ బాగుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూలు విడుదల సమయం కంటే..ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి రాష్ట్రంలో చాలా మెరుగైందని భావిస్తున్నారు. అందరి అంచనాలకు మించి రేవంత్‌రెడ్డి లోక్‌ సభ ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలు సాధిస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌లతో రోజంతా బిజీగా ఉంటున్నారు. ఎందరో సీనియర్‌ నేతలున్నా..రాష్ట్ర కాంగ్రెస్‌లో అన్నీ తానై వ్యవహరిస్తూ పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు శ్రమిస్తున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *