కాలుకు గాయమైనా..‘చెయ్యి’కి చేదోడు!
- కాంగ్రెస్క మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ విస్తృత ప్రచారం.
- సికింద్రాబాద్‌లో దానం నాగేందర్ గెలుపే ధ్యేయంగా ముందుకు.
- కీలకమైన సనత్‌నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్రలు,ర్యాలీలు.
- ప్రచారంలో ప్రమాద వశాత్తు గాయపడినా వెనుకడుగు వేయని వైనం.
- స్థానిక నేతలు,కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ సమావేశాలు.
- రేవంత్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ…ఆరు గ్యారంటీల అమలుపై ఇంటింటికీ ప్రచారం.
కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయురాలిగా పేరొందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,సనత్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ ఇప్పుడు టాక్ ఆఫ్ ద పార్టీగా మారారు.ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఆమె..పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.కాలికి గాయమైనా లెక్కచేయకుండా..స్టిక్ సాయంతో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు.సనత్‌నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా తిరుగుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు కోసం నీలిమ తీవ్రంగా కృషి చేస్తున్నారు.‘కీలక సమయంలో పార్టీ కోసం పనిచేయాల్సిందే. ఎన్నికలప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పని చేస్తాం’ అంటూ ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు.
రేవంత్ అండతో:
సీఎం రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు కలిగిన కోట నీలిమ.ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలు తీరును జనానికి కూలంకుశంగా వివరిస్తున్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,జీరో కరెంటు బిలు్లలు, రూ.500 గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇవి పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కోట నీలిమ తన ప్రచారంలో వివరిస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పేదలకు స్వర్ణయుగం వస్తుందని తెలుపుతున్నారు.డైనమిక్ సీఎం రేవంత్‌రెడ్డికి అండగా ఉండాలని, ఆయన నేతృత్వంలో తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ఆమె అంతటా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిజాయితీ నేతగా పేరు:
కోట నీలిమ సనత్‌నగర్ సెగ్మెంట్లో గత కొద్దిరోజులుగా మంచి పేరు సాధించారు.నీతి, నిజాయితీగా వ్యవహరించడమే కాకుండా సామాన్యులు ఎవ్వరు తన వద్దకు ఎలాంటి సమస్యను తీసుకువచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని ఆమె అందరికీ హితబోధ చేస్తుంటారు. ప్రజలు,కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటారని పేరుంది.జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రజా సమస్యలపై కోట నీలిమకు మంచి అవగాహన ఉందని స్థానిక నేతలు అంటున్నారు.ఆ అవగాహనతోనే ఆమె సనత్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారని చెబుతున్నారు.పిలిచిన వెంటనే పలికే నేతగా ఆమెకు పేరుంది.పార్లమెంట్ ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌కు భారీ మెజార్టీ రావాలని,తద్వారా ఈ నియోజవర్గానికి మంచి జరుగుతుందని కోట నీలిమ చెబుతున్నారు.ఇక్కడి ప్రజలు ఆదరిస్తే తాను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె ఎన్నికల ప్రచారంలో ధీమాగా చెబుతున్నారు.ఇక కాలికి గాయమైనా మొక్కవోని దీక్షతో ఎన్నికల ప్రచారం చేస్తున్న నీలిమకు పార్టీ నేతల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.ఆమె పట్టుదల ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
By ఎన్.మల్లేష్ ( వార్త ).