‘కోటంత’ మనసు…
సేవే ఆమెకు తెలుసు
- రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్న డాక్టర్ కోట నీలిమ.
- కాంగ్రెస్ పార్టీ సనత్‌నగర్ ఇన్‌చార్జిగా ఉంటూ ప్రజలతో మమేకం.
- స్థానిక సమస్యలపై ఫోకస్.
- నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలతో నిత్యం సంప్రదింపులు.
- ప్రజా సమస్యలు తెలుసుకుని..పరిష్కారానికి సత్వర చర్యలు.
- అధికారులతో మాట్లాడి..వినతి పత్రాలు ఇస్తూ ముందుకు.
- కలిసి వస్తున్న ఢిల్లీ స్థాయి పరిచయాలు..సీం రేవంత్‌తో మంచి సంబంధాలు.
- మేడం..మా వీధిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. కొంచెం బాగుచేయించండి.
- మాకు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది మేడమ్..మీరే కొంచెం అధికారులకు చెప్పి సమస్య పరిష్కరించాలి.
- మా వీధిలో లైట్లు వెలుగతలేవు..చీకట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం..జీహెచ్‌ఎంసీ అధికారులకు ఒక మాట చెప్పి లైట్లు వేయించడమ్మా.
ఈ విన్నపాలు వింటే మీకేమనిపిస్తుంది…ఏ మంత్రికో..ఎంపీకో..ఎమ్మెల్యేకో జనం పెట్టుకున్న మొరలా ఉంది కదా..కానీ కానే కాదు. సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ ఇప్పుడు టాక్ ఆఫ్ ది గ్రేటర్‌గా మారారు.ఆమె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా..నిరంతరం ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు ఆలకిస్తూ..అధికారులతో మాట్లాడి వేగంగా వాటిని పరిష్కరిస్తూ ప్రజల మనసుల్లో మంచి స్థానం సంపాదిస్తున్నారు.పదవి..అధికారం ముఖ్యం కాదు..ప్రజల మనసు గెలవడమే లీడర్ లక్షణం అంటున్న ఆమె..తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలు..పార్టీ నేతలు,సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్నమంచి సంబంధాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.ఎన్నికల సమయంలోనే కాదు..నిత్యం ప్రజల మధ్య ఉన్నోళ్లనే ప్రజలు ఆదరిస్తారని..అందుకే తాను పార్టీ నేతలు, కార్యర్తలను ఉత్సాహపరుస్తూ..వారి సహకారంతో ముందుకు వెళ్తున్నాని అంటున్న డాక్టర్ నీలిమ తెలంగాణలో కొత్త ఒరవడి రాజకీయాలకు ఆద్యురాలిగా నిలుస్తున్నారని చెప్పొచ్చు.
అందరి సహకారంతో:
సనత్‌నగర్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న కోట నీలిమ ఇక్కడి ప్రజల సమస్యలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల సమస్యలు ఆలకించేందుకు ఆమె కింది స్థాయి నేతలు, కార్యకర్తల సహాయం తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట‍్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. నేతలు లేదా కార్యకర్తలు ఈ గ్రూప్‌లో ఆయా కాలనీల సమస్యలు ప్రస్తావిస్తే ఆమె వెంటనే స్పందిస్తున్నారు. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అధికారులతో మాట్లాడి వెంటనే పనులు అయ్యేలా చూస్తున్నారు.
అటు ఢిల్లీ పెద్దలు..ఇటు సీఎం రేవంత్ అండ:
ఏఐసీసీలోనూ పనిచేసిన అనుభవమున్న డాక్టర్ కోట నీలిమకు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మంచి అనుబంధం ఉంది. విద్యాధికురాలు, చురుకుగా వ్యవహరించే తత్వం, డైనమిజం కారణంగా ఆమెపై ఢిల్లీ పెద్దల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే ఆమెను ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన డెహా అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో ఎన్నికల పరిశీలకురాలిగా నియమించారు. అక్కడా చక్కగా పనిచేసిన నీలిమ…ఏకంగా హిమాచల్ సీఎం సతీమణి విజయంలో కీలకపాత్ర పోషించారు. అలా ఢిల్లీ స్థాయిలో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇక తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోనూ నీలిమకు మంచి సంబంధాలు ఉన్నాయి. నీలిమ సేవాతత్పరత, ఆమె డైనమిజాన్ని రేవంత్ సైతం ప్రశంసించారు. ఆమెకు అన్ని విధాలా సహకరిస్తున్నారు.
ఇవీ ‘మెచ్చు’తునకలు:
- అంకాలమ్మ బస్తీలోని దేవాలయంలో విద్యుత్ మీటర్ సమస్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇక్కడ విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయించాలని స్థానికులు కోట నీలిమ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె..విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడి మూడు రోజుల్లోనే విద్యుత్ మీటర్ అమర్చేలా కృషి చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు…అమీర్‌పేట డివిజన్ అధ్యక్షుడు ఎస్‌ఎస్ రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- అమీర్‌పేట డివిజన్ మున్సిపల్ వాటర్ సరఫరా తక్కువగా ఉండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈసమస్యను డాక్టర్ కోట నీలిమ దృష్టికి తీసుకురాగా..ఆమె వెంటనే వాటర్ వర్క్స్ డీజీఎం వంశీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. నీటి సరఫరా సమస్యను పరిష్కరించారు. అమీర్‌పేట డివిజన్ ప్రెసిడెంట్ ఎస్.ఎస్ రావు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎస్ రెడ్డి, బల్కంపేట వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్, జి.నవీన్, ఎం.శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సత్యనారాయణ యాదవ్, ప్రతాప్‌లు ఈ సమస్యను నీలిమ దృష్టికి తెచ్చి..అనంతరం కృతజ్ఞతలు తెలిపారు.
- ఎస్‌ఆర్ నగర్‌లోని లైబ్రరీ పార్కులో పచ్చదనం పెంపు చర్యలు లేక పార్కు వెలవెలబోతోంది. దీంతో ఇక్కడ గ్రీనరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ కోట నీలిమ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ సుధీర్ చంద్రను కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి పార్కును సుందరంగా తీర్చిదిద్దారు.
- బీజేఆర్ నగర్‌లో ఏళ్లతరబడి డ్రైనేజీ సమస్య ప్రజలను వేధిస్తోంది. దీనిపై స్పందించిన కోట నీలిమ జీహెచ్‌ఎంసీ అధికారులకు వినతిపత్రం ఇచ్చి..ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజల బాధలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రోడ్డు సౌకర్యం సరిగా లేక ఇక్కడ రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కూడా వివరించారు. దీంతో ఒకేసారి అటు డ్రైనేజీ…ఇటు రోడ్డు సమస్యలకు మోక్షం లభించి బీజేఆర్ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కోట నీలిమకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
- బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం రూట్లోని ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాలు జంక‌్షన్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండగా..డాక్టర్ కోట నీలిమ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ట్రాఫిక్ ఉన్నతాధికారులను కలిశారు. వెంటనే ఆ ప్రాంతంలో ఓ ట్రాఫిక్ బూత్ ఏర్పాటు చేసి కానిస్టేబుల్‌ను నియమించేలా చేశారు. దీంతో వాహనదారులకు రిలీఫ్ లభించింది.
By ఎన్.మల్లేష్ ( వార్త ).