భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానములో స్వామివారు శ్రీరామచంద్ర శామముతో వెలసియున్నారు అనేది జగర్విదితమైన సత్యం బ్రహ్మపురాణాంతర్గత గౌతమీ ఖండంలోని క్షేత్ర మాహాత్మ్యం. పొందరాత్ర దివ్యాగమము స్వామిని చతుర్భుణ శ్రీరామునిగా పేర్కొన్నాయి. అలయ నిర్మాత అయిన భక్తి రామదాసుగారు, దశవిధ సేవాక్రమములు ఏర్పాటుచేసిన తూము నర్సింహదాసుగారు కూడా రామచంద్రుడిగానే పేర్కొన్నారు. దేవస్థానము పేరు దేవస్థానమునకు వంబంధించిన అన్తులు, ఎండోమెంట్ రికార్డులు దేవస్థానములోని కాసనములు కూడ రామచంద్రుడిగానే స్వామిని పేర్కొంటున్నాయి. కాని, ఇటీవల దశాబ్దముగా స్వామివారి దివ్య నామమును రామచంద్రుడిగా కాక రామనారాయణుడిగా మార్పు చేసి గత నిత్య oordo acy వార్షిక కళ్యాణములను నిర్వహిస్తున్నారు. అందువలన కళ్యాణ స్వరూపము సంపూర్ణముగా మారి సీతారామ కళ్యాణముగా కాక, సీతాలక్ష్మీ సమేత రామనారాయణ కళ్యాణముగా రూపాంతరము చెందింది. ఇది ఏమని ప్రత్నించినవారికి ఇక్కడ దేవస్థానమునందలి వైదిక బృందమువారు స్వామికి రామనారాయణుడని విశేష. నామము ఉన్నదని, ఉత్సవమూర్తికి రామనారాయణుడని పేరు వున్నదని అనంబద్ధమైన సమాధానాలు ఇస్తున్నారు. ఎండోమెంట్ రికార్డులను అనుసరించి చూసినప్పటికీ మూల మూర్తికిగాని, ఉత్సవ మూర్తికి గాని రామనారాయణుడని పేరు లేదు. ఇక్ష్వాకు కులతిలక ఇకనైన బ్రోవవే రామచంద్రా అని కీర్తనలలో, దాశరథి కరుణాపయోనిధి అని శతకంలో భక్త రామదాసుగారు దశరథరామునిగా వేడుకొంటే ఇక్కడి వైదిక సిబ్బంది అందుకు విరుద్ధంగా భద్రాద్రి రాముడు దశరథరాముడు కాదని వ్యాఖ్యలు చేయడం, భక్తుల మనోభావాలను విశ్వాసాలను కించపరిచే విధంగా ఉన్నాయి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కొత్త పోకడలవలన భక్త రామదాసుగారు ఏర్పాటుచేసిన సీతారామచంద్రస్వామివారి కళ్యాణము రూపురేఖలు మారుతున్న కారణంచేత తక్షణమే స్పందించి రికార్డుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోగలరు.
పరమ పవిత్రంగా భావించబడే సీతమ్మవారి నిత్య కళ్యాణములో బనియోగించేటటువం మంగళ సూత్రము. లక్ష్మణస్వామివారికి అలంకరించేటటువంటి ఆభరణము 2016వ సంవత్సరములో బోలీకి గురి అయినవి. ఈ విషయం ఎంతో కలకలాన్ని సృష్టించినది. ఈ విషయం అన్ని వార్తాపత్రికలలోను ప్రచురితమైంది. ప్రముఖ ఛానల్స్ అన్నింటిలోను ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కె.అ. ఓ గారు వచ్చి తనిఖీ చేసి నిజమే! ఇక్కడ ఆభరణములు లేవు ధృవీకరించటం జరిగింది. కార్యనిర్వహణాధికారిగారు పోలీసువారికి ఈ విషయమై ఫిర్యాదు చేయటం, సదరు పోలీసు శాఖవారు 409 సెక్షన్ కింద బదుగురు అర్చకులపైన కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించటం కూడ పత్రికలు, ఇతర వార్తా ఛానల్స్ పేర్కొని ఉన్నాయి. కాని నాటకీయంగా నగలు అపహరణకు గురి అయిన 9 రోజులకు తర్వాత జె.ఇ.ఓ. గారు నగలు అపహరింపబడ్డాయని ధృవీకరణ చేసిన తర్వాత తిరిగి పోయిన చోటనే లభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇవి అపహరింపబడిన నగలా? లేక నూతనంగా తయారు చేయించినవా? అనేది తేలవలసి ఉన్నది. ఇంత జరిగినప్పటికీ పూర్తిస్థాయి విచారణ జరిపి దోమలు ఎవరనేది నిర్ధారణ చేయకపోవడం విడ్డూరం. ఈ విషయమై పోలీసు శాఖవారిని ఆర్టీఐ ద్వారా కోరగా, ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు పోలీసు స్టేషన్ లో నమోరు కాబడలేదన్న విషయం మమ్మల్ని విస్మయానికి గురిచేసింది. దేవాదాయ శాఖకు అవి మాయని మచ్చగా మారింది ఇప్పటికైనా వెనువెంటనే తగిన విచారణ జరుపుటకు కావలసిన చర్యలకు పూనుకొని దోషులని శిక్షించగలరు.