ఇక్కడ ఫొటోలో ఈ అమ్మాయిలు టిప్ టాప్ గా జీన్స్ టీ షర్ట్, ఫార్మల్ షర్ట్ వేసుకుంటారు. నిర్మానుష్యంగా కనిపించే రోడ్లపైన వెళ్లే వెహికిల్స్ ని ఆపి స్వచ్చంద సేవ పేరుతో రిసిప్ట్,సంస్థ వివరాలు కూడా చెప్పకుండా 50 నుండి 500 వరకు లాగుతున్నారు. గుంటూరు, తిరుపతి, నెల్లూరు తర్వాత హైద్రాబాద్ వచ్చారు. నగరంలోని ఘాట్ కేసర్ వద్ద దాబాయించి పైసలు వసూలు చేస్తుంటే PHC ఎన్జీవో లో మెంబర్ జయంత్ కంటపడ్డారు. మీ సంస్థకు రిజిస్ట్రేషన్ కూడా లేదు మీరు చేస్తుంది తప్పని చెప్పినందుకు గొడవకు దిగారంటా, వెంటనే సదరు అబ్బాయి పోలీస్ కి కాల్ చేసి పిలిపించాడు. కూపీ లాగితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముఠా అని, ఇప్పటికే ఇలాంటి నకిలీ విరాళాలు చాలానే చేశామని ఒప్పుకున్నారు. కేసు రిజిష్టర్ అయింది.