నన్నెవడ్రా…ఆపేది!

నన్నవడ్రా…ఆపేది!

  • పశ్చిమ మండలం పరిధిలో ఓ సీఐ ఆగడాలు.
  • పోస్టింగ్ ‘దానం’ తెచ్చుకొని రెచ్చిపోతున్న వైనం.
  • స్థానిక నేత అండతో అడ్డగోలు వసూళ్లు-సెటిల్మెంట్లు.
  • నేత కాపాడుతాడనే ధీమాతో విచ్చలవిడి ప్రవర్తన.
  • అన్ని తెలిసిన కిమ్మనని ఉన్నతాధికారులు.

అది నగరంలోనే అత్యంత కీలక పోలీస్ స్టేషన్. అలాంటి పోలీస్ స్టేషన్ ని ఒక సీఐ కి ‘దానం’ ఇచ్చారు ఒక ప్రజా ప్రతినిధి. తన కులం వాడే అంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ అక్కడ పోస్టింగ్ ఇప్పించారు. ఇంకేముంది సదరు సీఐకి ఆడిందే ఆట,పాడిందే పాట చందంగా మారింది. తనకున్న మిడిమిడి జ్ఞానంతో వసూళ్లకి తెగ పడుతున్నారు. అక్కడ ఏ కేసు ఎఫ్.ఐ.అర్ కావాలన్న డబ్బులు ముట్ట చెప్పాల్సిందే. ఆయన ఎవ్వరి మాట వినడు. ఆయనకి ఆ పోస్టింగ్ ‘దానం’ చేసిన నేత మాట తప్ప. దీంతో ఈయన అరాచకాలు అన్నీ తెల్సినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. దీంతో ఒక పబ్ యాజమాని వద్ద లక్షలు మామూళ్లు తీసుకుంటు అడ్డంగా దొరికిపోయినా సరే ఆయన స్థానం పదిలంగా ఉంది. ఇది ఆయన చరిష్మానా? ఆ నేత చరిష్మానా అన్నది ఎవ్వరికి అర్ధం కానీ పరిస్థితి. సివిల్ పంచాయితీలు మొదలు మసాజ్ పార్లర్లు వరకు ఆయన చేయని సెటిల్ మెంట్ లేదు.

ఇక సివిల్ పంచాయతీ లో నేరుగా దూరిపోవడం ఈయన కి అలవాటు. ఏదైనా స్థలం, ఇల్లు ఖాళీ చేయించాలన్న ఈయన గారికి కాసులు ఇస్తే చాలు నేరుగా తన సిబ్బంది తో దూరిపోతారు. అది కోర్టులో ఉన్నా సరే. ఏది పట్టించుకోరు. మొన్నటికి మొన్న ఒక ప్రముఖుని పై కేసు నమోదు చేయడానికి సదరు ఫిర్యాదుదారుని వద్ద లక్ష రూపాయలు తీసుకున్నట్టు ఉన్నతాధికారులకి తెల్సి చివాట్లు పెట్టినట్టు తెల్సింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రముఖులు నివసించే ఈయన పరిధిలో పబ్ లు, మసాజ్ సెంటర్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. లక్షల రూపాయలు మాముళ్లు వసూల్ చేస్తూ సమయపాలన, నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. తన కింది స్థాయి సిబ్బంది సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసినా ఎన్నో విషయాల్లో తనదైన శైలిలో ముందుకు పోతారు తప్ప.. తన ఉద్యోగం ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయరు. తన సర్వీస్ మొత్తం ఆరోపణలతో బదిలీలు జరిగినా ఆయనలో మార్పు రాలేదు. ఇక ఎదో ఒక రోజు ఈయన కి పోస్టింగ్ దానం చేసిన నేత కిందికి నీళ్లు తెచ్చేవరకు సదరు సీఐ మారేలా లేరు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *