ఆయన “లుంగీ” కడితే అంతే!

ఆయన “లుంగీ” కడితే అంతే!

  • పశ్చిమ మండలంలో ఒక సీఐ వింత పోకడ.
  • లుంగీతో స్టేషన్లో విధులు.
  • మహిళా సిబ్బందిపై దురుసు ప్రవర్తన.
  • ఫిర్యాదుల పై అలసత్వం.
  • వసూళ్ల పైనే ఆసక్తి.
  • బీ ఆర్ ఎస్ నేత అండతో అరాచకాలు.
  • “బండ “ప్రాంతంలో “బోరు “మంటున్న స్థానికులు.

కోతి కి కొబ్బరి చిప్ప ఇస్తే…అన్న చందంగా ఉంది నగరంలోని పశ్చిమ మండలంలోని ఒక పోలీస్ స్టేషన్ సీఐ గారి తీరు. పోలీస్ స్టేషన్ల పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ ఒక కొత్త పోలీస్ స్టేషన్ సీఐ వింత పోకడతో స్థానిక ప్రజలే కాదు సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారని సమాచారం, ఏకంగా స్టేషన్ లోనే ” లుంగీ” కట్టుకొని తిరగడం ఇక్కడ సిబ్బందిని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నోరు విప్పితే బూతులు మాట్లాడే సదరు సీఐ గారు మధ్యాహ్నం పూట స్టేషన్ లోని విశ్రాంతి తీసుకోవడం అలవాటు. ఐతే అప్పుడప్పుడు సడన్ గా తన విశ్రాంతి గది నుండి లుంగీలో నే బయటకి వచ్చి కింది స్థాయి సిబ్బందికి పనులు పురామాయిస్తాడు అని సిబ్బంది చెప్తున్నారు. దీంతో అక్కడ పనిచేసే మహిళా సిబ్బంది ఈ సారు “లుంగీ ” అవతార్ చూడలేక ఇబ్బంది పడుతున్నారని తెల్సింది. ఇక ఈయన గారు మహిళా సిబ్బంది పట్ల వ్యవహరిస్తున్న తీరు పై అనేక మంది మహిళా సిబ్బందిలోలోన మదన పడుతున్నారు. ఇటీవల ఇక్కడ పని చేసే ఒక మహిళా కానిస్టేబుల్ ఒకరు మెటర్నరీ లీవ్ పెడితే ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో… కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఇతర మహిళా సిబ్బందిని సైతం నోటికి వచ్చిన బూతులతో ఇబ్బంది పెడ్తున్నట్టు కొందరు వాపోతున్నారు. ఇక స్టేషన్ నిర్వహణ విషయానికి వస్తే.ఈయనగారి చిల్లర వసూళ్ల దందాపై స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. స్టేషన్ కి వచ్చే ప్రతి కేసులో కాసులు కావాల్సిందే అని వేధిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త స్టేషన్ కావడంతో ఏసీ మొదలు ఇతర వస్తువులు కావాలని చేస్తున్న వసూళ్లపై అనేక విమర్శలు విపిస్తున్నాయి.

స్థానిక బీ ఆర్ ఎస్ నాయకుడుని అడ్డుపెట్టుకొని పోలీస్ స్టేషన్లో సామాగ్రి కొనుగోలు పేరుతో లక్షల రూపాయలు వసూలు చేయించినట్టు వినికిడి.ప్రస్తుతం సదరు బీఆర్ ఎస్ నేత ఏం చెప్తే అదే వేదంలా సదరు సీఐ వ్యవహరిస్తున్నట్టు తెల్సింది. గతంలో ఒక యువతి పై “అత్యాచారం” ఆరోపణలు ఎదురుకున్న,ఈ బీఆర్ ఎస్ నేత అంటే సీఐ గారికి తెగ ప్రేమ అని తెల్సింది. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే గతంలో పశ్చిమ మండలంలో అత్యంత సున్నిత ప్రాంతంగా పేరు పొందిన ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. సదరు సీఐ గారు ఈ పరిధిలోని స్టేషన్ బాధ్యతలు తీసుకున్నాక అనేక సమస్యలు మళ్లీ పుట్టుకొస్తున్నాయని జనం అంటున్నారు. ముఖ్యంగా కొన్ని సున్నిత అంశాల పట్ల ఈయన వ్యవరించిన తీరు వల్ల స్థానికులు స్టేషన్ ముందు ఆందోళనకి సిద్దమయ్యారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అనుభవం లేకో లేదా తన వ్యవహారశైలి వల్లో కానీ ఇక్కడ గతంలోని లేని కొత్త సమస్యలు పుట్టుకోస్తున్నాయి అని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కీలక ప్రాంతమైన ఈ కొత్త పోలీస్ స్టేషన్ పై దృష్టి సారించాలని కోరుతున్నారు. లేదంటే” “బండ” లాంటి ఈ ప్రాంతం లో ప్రజలు “బోరు “న విలపిస్తారని స్థానికులు అంటున్నారు.

5 గంటలు రెస్ట్ లోనే….

మధ్యాహ్నం 2 గంటలకు రెస్ట్ రూంలోకి వెళ్తే. సాయంత్రం 6 గంటలకు బయటకు వస్తున్న సీఐ గారు.రోజుకు 5 గంటలు విశ్రాంతి లోనే వుంటారట. దీంతో ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన బాధితులు రోజంతా స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈయన నిర్లక్ష్యం.ఫిర్యాదు పట్టించుకోకుండా ఉండడం వల్ల గత గురువారం ఓ బస్తీలో పెద్ద గొడవ జరిగిందని సమాచారం. ఈ గొడవను డీల్ చేయలేకపోవడం తో స్వయంగా ఉన్నతాధికారులే రంగంలోకి దిగాల్సి వచ్చింది అని తెలిసింది. ఏది ఏమైనా ఈ వింత సీఐ వల్ల రోజుకో సమస్య పుట్టుకొస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతా ధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

By ఎన్.మల్లేష్ బాబు ( సీనియర్ జర్నలిస్ట్ ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *