కార్పొరేటర్ “వనం” లో కలెక్షన్ ల జోరు

కార్పొరేటర్ “వనం”లో కలెక్షన్ ల జోరు

  • భవనాలు మొదలు ఫుట్ పాత్ లను వదలని వైనం
  • ఖైరతాబాద్ నియోజిక వర్గంలో ఓ కార్పొరేటర్ భర్త ఆగడాలు
  • మంత్రి కె టి అర్,మాగంటి ఆగ్రహం?
  • తీరు మార్చుకొమ్మని అదేశం….

వార్త టుడే (పంజాగుట్ట) :

ఒక వైపు ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం పలు రకాల పథకాలు తెస్తూ నగర ప్రజల మెప్పు పొందుతూ ఉంటే మరో వైపు కొందరు టి అర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి కార్పొరేటర్ గా గెలిచాక కలెక్షన్ లకు తెగ బడ్తు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు,ఏకంగా సొంత పార్టీ ఎం.ఎల్.ఏ లు ఆగ్రహం వ్యక్తం చేసినా తీరు మార్చుకోకుండా ఫూట్ పాత్ వ్యాపారులు మొదలు భవన నిర్మాణాల వద్ద వసూళ్ళు చేస్తూ విమర్శల పాలవుతున్నారు,ఖైరతాబాద్ నియోజిక వర్గంలోని ఒక మహిళ కార్పొరేటర్ భర్త చేస్తున్న వసూళ్లు సొంత పార్టీ కార్యకర్తలని సైతం నివ్వెర పరుస్తున్నాయి,ఇతని అగడలపై మంత్రి కే టి అర్,మాజీ మంత్రి దానం కి సైతం ఫిర్యాదులు అందినట్టు సమాచారం.

అది నగరం లోనే కీలక ప్రాంతం, ప్రముఖ వ్యాపార సంస్థలు,ప్రముఖుల నివాసాల సముదాయాలు అక్కడే ఉంటాయి,ఎప్పటికప్పుడు కొత్త కొత్త భవన నిర్మాణాలు వెలుస్తుంటాయి,ఇంకేముంది స్థానిక కార్పొరేటర్ భర్త కి పండుగే, ఎక్కడ నిర్మాణం మొదలైన వెంటనే బ్లాక్ మెయిల్ మొదలవుతుంది,లక్షలు డిమాండ్ చేయడం ఇవ్వక పోతే జి హెచ్ ఎం సి అధికారులను పిలిచి పనులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది,తన సతీమణి కార్పొరేటర్ కాక ముందు ఇతనికి ఫూట్ పాత్ వ్యాపారుల వద్ద మామూళ్లు తీసుకొనే అలవాటు ఉంది, దీంతో తన పాత అనుభవాన్ని రంగరించి ఫూట్ పాత్ వ్యాపారులను సైతం వదలడం లేదు.

చిన్న టీ కొట్టు ని సైతం వదలకుండా నెల మామూళ్ల కోసం వేదిస్తున్నట్టు కొందరు వ్యాపారులు వాపోతున్నారు,ఇక కొత్త భవన నిర్మాణాల వద్ద వసూళ్ల పర్వానికి అంతు లేకుండా పోతుంది,లక్షలు లక్షలు వసూల్ చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వని వారి భవన నిర్మాణ పనులను అడ్డుకోవడం ,లేదా కూల్చి వెయిస్తామని బెదిరిస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు,ఈ క్రమంలో ఈయన డివిజన్ పరిధి లోని ఒక భవన నిర్మాణ దారుణ్ణి లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు జూబ్లీ హిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాథ్ దగ్గరకి వెళ్ళి ఆ కార్పొరేటర్ భర్త పై ఫిర్యాదు చేసినట్టు,దింతో మాగంటి ఈ వసూల్ రాజా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం,అంతే కాకుండా జూబ్లీ హిల్స్ నియోజక పరిధి లోని ఒక హోటల్ యజమానిని నెలసరి మామూళ్లు ఇవ్వమని బెదిరించగా అతను ఒప్పుకోక పోవడంతో జి హెచ్ ఎం సి అధికారులతో నాలుగు రోజుల పాటు ఆ హోటల్ ని మూయించి వేసినట్టు తెల్సింది,అదే విదంగా మరో భవన నిర్మాణ యజమానిని ఇప్పటికి వేదిస్తున్నట్టు తెల్సింది.

ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక మంది ఈ మహిళ కార్పొరేటర్ భర్త బెదిరింపులకు లక్షలు ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇతని వసూళ్ల పర్వానికి మరో సీనియర్ నాయకుడు సహకారం అందిస్తున్నట్టు కార్యకర్తలు చెప్తున్నారు, ఇప్పటి కి వసూళ్ళ లో ఎంతో అనుభవం ఉన్న ఈ నేత ప్రస్తుతం ఈ కార్పొరేటర్ భర్త కి రైట్ హాండ్ గా నిలవడమే కాకుండా ఆ డివిజన్ లో ఏమైనా కొత్త నిర్మాణాలు మొదలు ఐతే వెంటనే “నాగరాజు” లా బుస కొట్టి మరి బెదిరించడం,వెంటనే ఈ విషయం ఆ కార్పొరేటర్ భర్తకి చేరవేయడం ఇతని పని చెప్పుకుంటున్నారు,ఏది ఏమైనా ఒక సాధారణ కార్యకర్త కి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న మాజీ మంత్రి దానం నాగేందర్ కి కూడా భవిష్యత్ లో ఈ కార్పొరేటర్ భర్త తల నొప్పులు తెచ్చే అవకాశం ఉంది,ఇప్పటికైనా దానం ఇతని వసూళ్ల దూకుడు కి కళ్లెం వేసి పార్టీ కి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని సాక్షాత్తు సొంత పార్టీ నేతలే కోరుతున్నారు.

వార్డు మెంబెర్ గా కూడా గెలవలేని ఈయన గారిని దానం ఆదేశాల మేరకు ఒకరిద్దరు దానం వీరాభిమానులు ఈయన సతీమణి ని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసారు,ఎప్పుడు ఐతే ఈ వసూళ్ల పర్వం మొదలు పెట్టాడో అప్పటి నుండి ఆ ముఖ్య కార్యకర్తలని దూరం పెట్టడం కొస మెరుపు,పాపం ఇప్పుడు వాళ్లంతా ఇతన్ని ఎందుకు గెలిపించమా అని లోలోన మదన పడుతున్నారు,తమ నేత దానం నాగేందర్ పై అభిమానంతో నోరు విప్పకుండా మౌనం గా ఉన్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *