మోదీ చాణక్యం..ఎవరికీ అందని వ్యూహం

మోదీ చాణక్యం..ఎవరికీ అందని వ్యూహం

  • ఒక్క దెబ్బతో కేసీఆర్‌, కాంగ్రెస్‌లను కొట్టిన బీజేపీ.
  • బీఆర్‌ఎస్‌ దేశవ్యాప్తంగా ఎదగకుండా కట్టడి.
  • అందుకు తెలంగాణలో పార్టీనే త్యాగం చేసిన వైనం.
  • ప్రతిఫలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించి..పాగా
  • వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ పావులు.
  • సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిన టీం.

మోదీ రాజకీయ చాణక్యం అర్థం కావాలంటే ఈ తరానికే కాదు…గత తరానికీ సాధ్యం కాదేమో. భారత దేశ రాజకీయాల్లో మోదీ ఓ ధృవతార. అందుకే గత పదేళ్లుగా ఆయనకు ఎదురే లేదు..వచ్చే పదేళ్లూ ఆయనకు ఎదురే ఉండదేమో. ఇది నిజం. కాంగ్రెస్‌ పార్టీనే కాదు..తనకు ఎదురొచ్చే ప్రాంతీయ పార్టీలను సైతం అనూహ్యంగా దెబ్బతీసి..ఏం జరిగిందో తెలుసుకునే లోపే..శత్రుపార్టీలను నిర్వీర్యం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీని బలిపశువును చేస్తున్నట్లుగా రాజకీయ నేతలు, ప్రజలకు భ్రమలు కల్పిస్తూనే కేసీఆర్‌ను దెబ్బతీయాలనే తన లక్ష్యాన్ని అవలీలగా చేరుకున్నారు. అటు కాంగ్రెస్‌కు తెలంగాణలో మాత్రమే అధికారాన్ని ఎరగా వేసి…తాను లక్ష్యంగా పెట్టుకున్న ఉత్తరాదిలోని అతికీలకమైన మూడు(రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌) రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నాడు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొంది మూడోసారి అధికారం దక్కించుకునేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నాడు. ఈ వ్యూహం ఎవరికీ అర్థం కాలేదు. అందుకే ఆయన నరేంద్ర మోదీ అయ్యారు. ఇక తెలంగాణలో మోదీ మార్కు వ్యూహం ఎలా అమలైందంటే…

  • 🔥తెలంగాణలో చచ్చుబడి ఉన్న బీజేపీని తన రెక్కల కష్టంతో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా తయారుచేసిండు బండి సంజయ్‌. కాంగ్రెస్‌ కంటే వేగంగా క్షేత్రస్థాయిలో దూసుకెళ్లిండు.
  • 🔥అప్పుడు పాపం రేవంత్ మీద కాంగ్రెస్ సీనియర్లు రోజుకో సమస్యను సృష్టించి గందరగోళం లేపుతున్న సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుని సంజయ్‌ టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌ అయ్యాడు.
  • ఇక 🔥క్రమక్రమంగా రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీపై పట్టు పెంచుకుంటూ ఎన్నికలకు ఏడాది ముందే పోటీలో నిలబెట్టిండు.
  • ఈ పరిణామంతో 🔥తెలంగాణలో త్రిముఖ పోటీ తప్పదని గ్రహించిన బీజేపీ తమ పంథాను మార్చింది. అనూహ్య నిర్ణయాలు తీసుకుంది.
  • తమ బలమైన శత్రువుని దెబ్బతీసేందుకు..బలహీన శత్రువును ఎరగా వేసింది. బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు..ఉత్తరాది నుంచి రాహుల్‌, సోనియా, ఖర్గేల దృష్టిని మరల్చేలా కాంగ్రెస్‌కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంది. అందుకోసం తెలంగాణలో తమ పార్టీనే ఏకంగా బలిపెట్టింది. కొంచెం తర్కించి ఆలోచిస్తే ఇది స్పష్టమవుతుంది.
  • ఈ పథకంలో భాగంగానే తెలంగాణలో 🔥పార్టీ మాంచి ఊపుమీదున్న దశలో అకస్మాత్తుగా బండి సంజయ్‌ను అధ్యక్ష పీఠం నుంచి దింపేసింది బీజేపీ అధిష్టానం.
  • 🔥కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. స్వపక్షానికి, విపక్షాలకు, ప్రజలకు, విశ్లేషకులకూ కాడా అంతు చిక్కకుండా ఆడిన ఓ అద్భుత నాటకం ఆడింది. బీజేపీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే పని జరిగే దాక మీడియాకే కాదు మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్తది. అలా నేటి కేసీఆర్ ఓటమికి ఆనాడే బండి సంజయ్‌ను మార్చి బీజం వేసింది బీజేపీ అధినాయకత్వం.
  • కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సన్నిహితుడని..కిషన్‌రెడ్డికి..కేసీఆర్‌కు లోపాయికారి ఒప్పందం కుదిర్చి కవితను అరెస్టు చేయకుండా కాపాడారని జనాన్ని అయోమయంలో పడేసే నాటకమాడింది. 🔥ఈ విషయం బండి సంజయ్‌కు బాగా తెలుసు. కానీ పార్టీ విధేయుడైన సంజయ్ ఎక్కడా బయటపడకుండా ఆటను బాగా రక్తి కట్టించాడు.ఈ క్రమంలోనే కొద్ది రోజులు కావాలనే సంజయ్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టారు .
  • ఈ దశలో అయోమయానికి గురైన కొందరు బీజేపీ నేతలు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని భావించి ఆ పార్టీలోకి చేరిపోయేలా చేశారు.
  • ఇలా బలమైన నాయకుల వలసలతో రేవంత్ పదునైన వ్యూహం పన్నాడు. అద్భుత నాయకత్వ లక్షణాలతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

మందకృష్ణతో మిలాఖతై :

ఇలా సంజయ్‌ తొలగింపు నాటకంతో పాటు మరో కీలకమైన ముందడుగు వేసింది బీజేపీ. రాజకీయ పరిశీలకులకు అందనంత అనూహ్యంగా మందకృష్ణ మాదిగతో చేతులు కలిపి సంచలనమే సృష్టించింది. 🔥మాదిగల వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. ఇందులోనూ కేసీఆర్‌ను దెబ్బతీసే వ్యూహమే ఉంది. దళితబంధు వంటి పలు పథకాల ద్వారా కేసీఆర్‌ సంపాదించుకున్న దళితుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు..వాటిని చిన్నాభిన్నం చేసేందుకు వర్గీకరణ అనుకూల నిర్ణయాన్ని ప్రకటించారు. దళితుల ఓట్లు కొంతమేరైనా కేసీఆర్‌కు పడకుండా చేశారు. ఇలా దళితుల ఓట్లను చీల్చి కాంగ్రెస్‌ గెలుపునకు రూట్‌ క్లియర్‌ చేశారు.

ఇలా సొంత పార్టీనే ఓడేలా చేసి..ప్రతిపక్ష కాంగ్రెస్‌ గెలుపునకు బాటలు వేసిన మోదీ నిర్ణయాల వెనుక పెద్ద వ్యూహమే దాగుంది. ఆయన తెలివి లేక ఈ పని చేయలేదు. తనకు బలమైన శత్రువుగా ఎదుగుతున్న కేసీఆర్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన..ఆయన టీం పనిచేసింది.
కేసీఆర్‌ 🔥తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి దేశమంతటా విస్తరించుటకు ప్రణాళికలు సిద్దం చేసుకుని పర్యటనలు మొదలు పెట్టాడో..అప్పుడే కేసీఆర్ దుకాణం బంద్‌ చేయాలని…తెలంగాణ ప్రజలకు ఆయనను దూరం చేయాలని స్కెచ్‌ వేశారు. 🔥కేసీఆర్ బలమైన నేత. అద్భుతమైన వాగ్దాటి ఉన్న గొప్ప లీడర్‌. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. ఆయా స్థానిక సమస్యలను ఉటంకిస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలనే మార్చగలిగే దమ్మున్న నేర్పరి. ప్రాణాలను ఫణంగా పెట్టి..🔥తెలంగాణను తెచ్చిన నేతగా దేశవ్యాప్తంగా పేరు గడించిన నేత. కాబట్టి కేసీఆర్ మాటను దేశ ప్రజలు నమ్ముతారు. దానికి తగ్గట్టుగా పంజాబ్, హర్యానా, డిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో కేసీఆర్‌ తన కార్యాచరణ మొదలుపెట్టారు. 🔥మోదీకి ప్రత్యమ్నాయమని దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా ప్రచారంతో ఫ్లెక్సీలతో సోషల్ మీడియాతో బీజేపీ పతనానికి పునాది వేశాడు. ఈ నేపథ్యంలో 🔥కాంగ్రెస్ కంటే ముందు బీఆర్‌ఎస్‌తో తనకు ఎక్కువ ప్రమాదమని గ్రహించి, కేసీఆర్‌ను కట్టడి చేయాలని నిర్ణయించారు. అందుకు తెలంగాణలో రాష్ట్ర బీజేపీని ఫణంగా పెట్టి విజయవంతంగా కేసీఆర్‌ను దెబ్బ కొట్టి తమకు భవిష్యత్తులో పోటీకి రాకుండా…దేశంలో బీఆర్‌ఎస్‌ అనేదే విస్తరించకుండా నియంత్రించారు. 🔥కాంగ్రెస్‌కు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను అప్పగించి..ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఫోకస్ అంతా తెలంగాణ మీద పెట్టేలా చేశారు. తెలంగాణ ఒక్క రాష్ట్రం వదులుకుని…మూడు రాష్ట్రాల్లో (రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌) దెబ్బ కొట్టారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు..ఇటు కేసీఆర్‌ను..అటు కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో దెబ్బ కొట్టారు. ఇక 🔥కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలంగాణలో గెలిచినందుకు సంబరపడాలో అటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లలో ఓడిపోయినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితిని కల్పించారు.
..అబ్బా ఏం రాజకీం..ఏం చాణక్య నీతి..రాజకీయమా నీ రాజకీయానికి జోహార్లు🙏🙏🙏. ముఖ్యంగా కలియుగ చాణక్యుడు నరేంద్ర మోదీకి హ్యాట్సాఫ్‌.

కారణం కేసీఆర్ :

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *