పోలీసింగ్ “లే ఖల్లాస్”
. పెరిగిన నేతల సిఫార్సు లేఖలు
. మూలన పడ్డ” ప్రతిభ”ప్రాధన్యత
. తలలు పట్టుకుంటున్న ఉన్నతాధికారులు
. విమర్శల పాలవుతున్న పోస్టింగ్స్ వ్యవహారం
ఒక పోలీస్ అధికారికి ఒక చోట పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ అధికారి ప్రతిభ,అతని గత పనితీరుని పరిశీలించి పోస్టింగ్ ఇచ్చేవారు గతంలో ,ఎంత రాజకేయ నేత ల ఒత్తిడి ఉన్న డెబ్భై శాతం అతని పని తీరు,ప్రతిభ ఆధారంగా,ఒక ముప్పై శాతం నేతల సిఫార్సు లకు ప్రాధన్యత ఇస్తూ పోస్టింగ్ లు ఇచ్చేవారు పోలీస్ శాఖలో,కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది, కేవలం నేతల ఒత్తిడి తోనే పోస్టింగ్ లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది,సిఫార్సు లేఖ ల సంఖ్య పెరగడంతో పోలీస్ ఉన్నతాధికారులు జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది,తాజా గా తెలంగాణ పోలీస్ శాఖ లో వివాదంగా మారుతున్న కొందరి పోస్టింగ్ ల వ్యవహారం తీవ్ర చర్చ కు దారి తీస్తుంది,ఇందుకు కారణం రాజకేయ నేతల ఒత్తిడి,సిఫార్సు ల లేఖ లే కారణమని పోలీస్ శాఖ లో తీవ్ర చర్చ నడుస్తోంది, వాస్తవానికి ఒక ప్రాంతంలో ఒక పోలీస్ అధికారిని నియమంచడంలో ఎంతో కొంత రాజకేయ నాయకుల జోక్యం,సిఫార్సులు సహజం,ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తమకు అనుకూలంగా పని చేసే అధికారిని నియమించుకోవలని స్థానిక నేతలు కోరుకోవడం పరిపాటి,కానీ నేటి పరిస్థితులు వేరు,గతంలో ఒక ఎమ్మెల్యే ఒక డీజీపీ స్థాయి అధికారికి ఫలానా అధికారికి మా ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని లేఖలు రాసేవారు,కానీ నేడు ఒక్క పోస్ట్ కి అనేక మంది నేతలు సిఫార్సు చేయడం వల్ల సమస్యలు పుట్టుకొస్తున్నాయి,ఒక్క పోస్టింగ్ కోసం నేడు పదుల సంఖ్యలో సిఫార్సు లేఖలు ఉన్నతిధికారులకు రావడం వల్ల వారు తలలు పట్టుకుంటున్నారు, ఒక నియోజక వర్గంలో ఒక పోలీసుస్టేషన్ కి ఒక సి ఐ ని నియమించడానికి సుమారు ఆరుగురు ని మించి ప్రజా ప్రతినిధులు తమ వారిని నియమించాలి అంటూ లేఖలు రాస్తున్నారు, ఒక సి ఐ పోస్ట్ కోసం స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి,ఇంచార్జి మంత్రి,నియోజిక ఇంచార్జి లు,జిల్లా మంత్రి, ఆ పై ప్రభుత్వం లో కీలక పాత్ర పోషించే వారి సిఫార్స్ లేఖలు అందుతున్నాయి,దీంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ప్రతిభ ఆధారంగా నియామకాలు చేయాల్సిన పోస్ట్ లు నేడు పూర్తిగా నేతల లేఖ లతో నియామకాలు చేయాల్సిన పరిస్థితి ,పోనీ స్థానిక ఎమ్మెల్యే ఒక్కరు సిఫార్సు చేస్తే కాస్త ఆటో ఇటో ఆ లేఖ కి ప్రాధాన్యత ఇచ్చి నియామకాలు చేపట్టవచ్చు,కానీ ఒక్క పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో సిఫార్సు లేఖలు రావడం,ఎవరిది పట్టించుకోక పోయిన ఏ ఉపద్రవం వస్తాడా అని పోలిస్ ఉన్నతిధికారులు తల బాదుకోవల్సి వస్తుంది,ఒక్కరినీ కాదన్న ఆ నేతలు వెంటనే తమ పై ప్రభుత్వానికి పిర్యాదు చేయడం,లేని పోనీ ఆరోపణలు చేయడం వల్ల అధికారుల పరిస్థితి అయోమయం గా మారింది,తాజాగా నగరంలో ని కొన్ని డి ఎస్పీ, ఇన్స్పెక్టర్ ల పోస్టింగ్ ల విషయంలో కూడా ఇదే జరిగినట్టు తెలుస్తుంది, ఒక ఇద్దరు అధికార పార్టీ ఎమ్యెల్ ల మధ్య పోస్టింగ్ కోసం కోల్డ్ వార్ నడుస్తున్నట్టు సమాచారం,స్థానిక ఎం ఎల్ ఏ ఒకరు ఒక ఏసీపీ కి పోస్టింగ్ ఇప్పించగానే ,పక్క నియోజిక వర్గ ఎం ఎల్ ఏ జోక్యం చేసుకొని మా వ్యక్తి ని ఎలా బదిలీ చేస్తారు అంటూ,తన పరపతిని ఉపయోగించి కొత్త గా వచ్చిన అధికారి విధుల్లో చేరకుండా ఆపారు అంటూ చర్చ జరుగుతుంది,మరో వైపు మా వాడిని ఎలాగైనా పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని ఇంకో ఎం ఎల్ ఏ పట్టుబట్టి డీజీపీ ని కల్సినట్టు సమాచారం, మరో వైపు ఒక సిఐ ని సైతం బదిలీ చేశాక , మూడు రోజుల్లో తిరిగి అదే స్టేషన్ కి పంపించడం గమనార్హం,ఇది ఏమైనా ఈ సిఫార్సు లేక సంఖ్య పెరగడం వల్ల ఎంతో మంచి పేరు ప్రతిష్టలు పొందుతున్న తెలంగామ్ పోలీస్ శాఖ అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది,పోలీస్ శాఖ ని పటిష్ట పరిచేందుకు కోట్ల నిధులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది,కేవలం రాజకేయనాయకుల ప్రమేయమే కాకుండా కాస్త ప్రతిభ,పని తీరు ని కూడా పరిగణలోకి తీసుకునేల పోలీస్ ఉన్నతాధికారులకు కాస్త స్వేచ్ఛ ని ఇచ్చేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.