అబ్బ….నేను వెళ్లను…!

అబ్బ….నేను వెళ్లను…!

. బదిలీ ఐనా సీట్ వదలను అంటున్న ఒక పోలీస్ అధికారి
. పశ్చిమ మండలంలో ఒక సీనియర్ అధికారి వ్యవహారం
. పోలీస్ శాఖలో కుల చిచ్చు రేప్తున్న వైనం

” తలలు పట్టుకుంటున్న ఉన్నతాధికారులు
ఒక జిల్లా మంత్రి పేరు చెప్పి బయపెడ్తున్న అధికారి “

ఆయన ఒక సీనియర్ పోలీస్ అధికారి,పైగా నగరంలో ప్రముఖులు నివసించే వి ఐ పి జోన్ లో పని చేస్తున్నారు,ఒక మంత్రి పేరు చెప్పుకుని గత కొద్ది ఏళ్లుగా తన రాజ్యాన్ని ఎలారు, ఎన్నో అవినీతి ఆరోపణలు వినిపించాయి, కానీ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఈ అధికారి పై చర్యలు ఎందుకు లే అని ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వదిలేస్తూ వచ్చారు, పలు మార్లు సుతి మెత్తగా మందలించి వదిలేశారు,కానీ ఆయన తన వ్యవహార శైలి మార్చుకోకుండా తన స్టైల్ లో కేస్ లు డీల్ చేయడం మొదలెట్టారు,దీంతో అధికారులు ఆయన్ని ఇటీవల బదిలీ చేశారు,ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా, నన్ను ఎలా బదిలీ చేస్తారు అంటూ,తన పలుకుబడి ని ఉపయోగించి నేను ఆ సీట్ ని వదిలేది లేదు అంటూ మారం చేస్తున్నారు, దీంతో ఈయన వ్యవహార శైలి నగర పోలీస్ శాఖ లో తీవ్ర చర్చ కి దారి తీసింది,పోలీస్ శాఖలో బదిలీలు సర్వ సాధారణం, కానీ ఉన్నతాధికారులు బదిలీ చేసిన,నేను ఇక్కడి నుండి కదిలేది లేదు అంటూ మొండి పట్టు పట్టడం వివాదానికి తెర లేపింది, ఈయన గారి మొండి పట్టు వల్ల తెలంగాణ ఏర్పడ్డాక మొట్ట మొదటి సారి పోలీస్ శాఖ లో కుల ప్రస్తావన వెలుగులోకి వచ్చింది,ఒక కుల సంగం నేత తమ దళిత అధికారులను ఎదగడనియ్యం లేదు అంటూ ఏకంగా మీడియా సమావేశం పెట్టారు,కొత్తగా ఈ పోస్ట్ లో చేరే అధికారి తమ దళిత సామాజిక వర్గం కావడం వల్లే, ఆయన్ను ఆ పోస్ట్ లో చేరకుండా అడ్ఢకుంటున్నారు అని ఈ దళిత సంగం నాయకుడు ఆరోపిస్తునాన్రు,దీంతో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేని తెలంగాన పోలీస్ శాఖలో ఈయన పెట్టిన చిచ్చు మచ్చ తెచ్చేలా ఉంది,మరో వైపు ఈ పోస్ట్ పై ఎందుకు అంత ఆసక్తి,ప్రేమ పెంచుకున్నారో అని కింది స్థాయు అధికారులు మధ్య చర్చ మొదలు ఇయ్యింది,ఇక ఈ పెద్డయన ఈ పోస్ట్ లోకి వచ్చి ఏడాదిన్నర దాటింది,పోనియి ఏమన్నా కీలక కేసుల్లో చురుగ్గా పాల్గొని తన ప్రతిభ చూపించారు అంటే అది లేదు,బందోబస్తు లో కూడా తన వాహనం లో కూర్చొని ఏసీ వేసుకొని తన కి ఇష్టమైన ఫ్రైడ్ జీడీ పప్పు తింటూ కూర్చుంటారు తప్ప, విధులు నిర్వర్తించిన పాపాన పోలేదు, పాపం వయస్సు మీద పడ్డాయన కదా అని ఆయన కింది స్థాయి అధికారులు,ఆయనకు గౌరవం ఇస్తూ అలా సర్దుకొని పోతూ సహకరిస్తూ పోతున్నారు, ఆయన అడిగిన టైం కి స్నాక్స్,కోల్డ్ కాఫీ లు పంపిస్తూ మిగతా డ్యూటీ వల్లే చేసుకుంటూ పోతున్నారు,ఇక ఈయన మాత్రం ఎక్కడో ఉన్న కేస్ లను తన దగ్గరికి రప్పించుకొని డీల్ చేయడంలో దిట్ట,తన స్టేషన్ ల పరిధి లోకి రాని కేస్ లను సైతం రాజీ చేస్తారు,ఇక స్టేషన్ లో పిర్యాదు ఇవ్వకుండా తన దగ్గరకి నేరుగా వచ్చేవారికి తన స్టైల్ లో న్యాయం చేస్తారు,ఇక ఈయన లీల గూర్చి చెప్పుకుంటు పోతే ఎంతో ఉంటుంది,తన సొంత జిల్లాల్లోని మంత్రి పేరు చెప్పి ఉన్నతాధికారులను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు,ఇక ఆయన సామాజిక వర్గం పేరు చెప్తే చాలు కొత్త కుర్చీలు తెచ్చి వెయిస్తారు,సరే ఇదంతా ఒక ఎత్తు ఐతే తాజా గా తన బదిలీ ని అపుకునేందుకు చేస్తున్న పనుల వల్ల యావత్ పోలీస్ శాఖకు మచ్చ వచ్చే అవకాశం ఉంది,ప్రపంచ వ్యాప్తంగా పేరున్న తెలంగాణ పోలీసు శాఖలో ఈ కులాల లొల్లి మొదలు ఐతే ,ఇన్ని రోజులు ప్రభుత్వం పడ్డ కష్టం మట్టి పాలు అవుతుంది,ఇప్పటి కైన ప్రభుత్వం,పోలీస్ ఉన్నతాధికారులు ఈ గొడవ ఇంకా పెద్ద గా కాక ముందే ఈ జీడీ పప్పు అధికారిని అక్కడ నుండి పంపించాలి అని పోలీసు శాఖ లోనే అంతర్గత చర్చ జరుగుతుంది,ఇక ఎం జరిగుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *