రాడిసిన్ లో రహస్య రాత్రులు…..తీగ లాగితే డొంక కదిలిన వైనం

  • అధికారుల దర్యాప్తు లో విస్తు గొలిపే నిజాలు
  • హోటల్ లో రాసలీలలు అసాంఘిక కార్యకలాపాలు
  • పోలిసుల చేతిలో ప్రముఖుల చిట్టా
  • సీసీ కెమెరాల్లో చిక్కిన వైనo
  • త్వరలో ప్రభుత్వానికి నివేదిక

తీగ లాగితే డొంక కదిలే లా ఉంది బంజారాహిల్స్ రాడిసిన్ పబ్ వ్యహారం,తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన రాడిసిన్ హోటల్ వ్యవహారం మరో మలుపు తిరిగేలా ఉంది,పబ్, డ్రగ్స్ వ్యహారం పక్కన బెడితే రాడిసిన్ హోటల్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అన్ని ఇన్ని కావు అని అధికారుల దర్యాప్తు లో తెలినట్టు సమాచారం,రాడిసిన్ హోటల్ గదుల్లో జరిగిన తెర వెనుక కార్యకలాపాల గూర్చు,పలువురు ప్రముఖులు తరచుగా ఈ హోటల్ కి వచ్చి రాసలీలలు కొనసాగించినట్టు పోలీసుల దర్యాప్తులో బయట పడ్తుంది,వాస్తవానికి ఈ రాడిసిన్ వ్యవహారం లో మొదట కేవలం పబ్ సమయం మించి తెరిచి ఉంచడం,డ్రగ్స్ వినోయోగంపై మాత్రమే ఆరోపణలు వినిపించాయి,కానీ పోలీసుల దాడి తర్వాత ఈ వివాదం మరింత ముదరడంతో వివిధ శాఖల కి చెందిన అధికారులు అంశంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది,దీంతో ఈ రాడిసిన్ హోటల్ లోని పుడ్డింగ్ మింక్ పబ్ తో పాటు హోటల్ కార్యకలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు,పోలీస్ శాఖ తో పాటు ఎక్సిజ్ శాఖ,ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్,ఇన్కమ్ టాక్స్, రెవిన్యూ శాఖలు ఈ హోటల్ కార్యకలాపాలపై తమ దైన శైలిలో దర్యాప్తు చేయడం మొదలు పెట్టినట్టు విశ్వనీయ సమాచారం,ఈ హోటల్ మాటున జరుగుతున్న దందా ఏమిటి,ఎవరి అండ తో ఈ హోటల్ కొనసాగుతుంది అన్న విషయం పై అరా తీయగా అసలు రాడిసిన్ గదుల్లో జరుగుతున్న తతంగం బయటకు వచ్చినట్టు సమాచారం,ఈ హోటల్ లిని అడ్డు పెట్టుకొని అనేక మంది ప్రముఖులు, వారి పుత్ర రత్నాలు అనేక అసాంఘిక కార్యకలాపాల లో పాల్గొనట్టు తెల్సింది, విదేశీ అమ్మాయిలతో రాసలీలలు, సెలబెరిటీలతో విందులు,చిందులు,గ్రూప్ సెక్స్ పార్టీలకు ఈ హోటల్ లో పలువురు ప్రముఖులు ,వారి పుత్రుల పేరిట గదులు బుక్ చేసినట్టు అధికారులు గుర్తించడం తో పాటు వారి వివరాల చిట్టా సేకరించినట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు,దర్యాప్తు తమను దిగ్ర్బాంతి గురి చేసే నిజాలు బయట పడ్డాయని,అనేక మంది రాజకేయ ప్రముఖుల తో పాటు సినీ పరిశ్రమ,ప్రముఖ వ్యాపార వేత్తల పిల్లల పేరిట గదులు బుక్ చేసి ఉన్నాయని, ఇక హోటల్ సిబ్బంది ని అంతర్గత విచారణ చేయగా వీరంతా ఈ హోటల్ ని అడ్డాగా చేసుకొని తమ కార్యకపాలపలు కొనసాగించినట్టు దర్యాప్తు లో తెలినట్టు ఆ అధికారి తెలిపారు,ఐతే ఇంకాస్త లోతుగా విచారణ జరిపి ,నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందచేస్తామని పేరు చెప్పడానికి ఇష్ట పడని ఆ అధికారి పేర్కొన్నారు,ఐతే ఈ హోటల్ లో జరిగిన కొంత రాసలీలల తంతు సీసీ కెమెరాల్లో కూడా వీరికి చిక్కినట్టు,ఇందులో పలువురు ప్రముఖుల రాసలీలలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం,ఐతే స్థానిక పోలీస్ లు ఒక వైపు డ్రగ్స్ వ్యవహారం పై దర్యాప్తు చేస్తుండగానే ఇతర శాఖల అధికారులు తమ స్టైల్ దర్యాఫ్తుని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది,ఐతే వీరికి చిక్కిన చిట్టాల లో కొందరు మీడియా ప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్టు వినికిడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *