…రాడిసిన్ దాడి వెనుక ????

రాడిసిన్ దాడి వెనుక…రహస్య ఎజెండా?

పోస్టింగ్ కోసం మరో పోస్ట్ కి ఎసరు

టైగర్ కోసం షార్ట్ మూవీ తీశారు అంటూ విమర్శలు

బంజారా హిల్స్ పబ్స్ పై టాస్క్ ఫోర్స్ రైడ్స్ వెనక రహస్య ఎజెండాలు కనిపిస్తున్నాయి. వ్యవస్థ లను మేనేజ్ చేసే సి ఐ పోస్ట్ కోసం.. రౌడీషీటర్లను గడగడలాడించిన మరో సిఐ ని బదిలీ చేయించడం వెనక కుట్ర జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతుంది. ఒకరి పదవికోసం మరొకరికి పోస్టింగ్ హుస్ట్ అని మాట్లాడుకుంటున్నారు.ఎలా అయితే పోస్టింగ్ వస్తుందో తెలుసుకుని పావులు కదిపారు. టాస్క్ఫోర్స్ టీం ఏదైనా స్పెషల్ కేసుని దర్యాప్తు లో భాగంగా సహకరిస్తుంది. ఇలాంటి రైడ్స్ కి సంబంధించిన వ్యవహారం లోకల్ టాస్క్ ఫోర్స్ కూడా ఇన్విల్వ్ అవుతుంది. కానీ నార్త్ జోన్ నుంచి వచ్చి రైడ్ చేయడంపై అనేక అనుమానాలు తావిస్తున్నాయి. నెల నెల పబ్స్ నుంచి లక్షల్లో మామూలు తీసుకుంటున్నా హయ్యర్ అఫీషియల్ కి తెలియకుండానే ఈ తతంగం జరిగిందంటే ఎవరు ఊహించడం లేదు. ఇప్పుడున్న సి ఐ కి ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదు. కేవలం లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో కఠినంగా వ్యవహరిస్తారని పేరుంది. పెద్దోళ్ల వ్యవహారం వద్ద చాలా జాగ్రత్తగా ఉండే వారు.. ACP ఏది చెపితే అదే అంటు.. తలా ఉపేవారు.. అఫ్జల్ సాగర్ బస్తి లో కరడుగట్టిన నేరస్థుల పట్ల మార్పు తీసుకు వచ్చిన సీఐ కి ఇలాంటి వ్యవహారంలో తలదూర్చి కుండా చాలా సాదా సీదాగా వ్యవహరించారు.. ఏదైనా ఏసిపి తోపాటు ఉన్నతాధికారుల instructions ఫాలో అవుతూ.. వాళ్ళకే అన్ని బాధ్యతలు అప్పగించే వారు.. అత్యంత ఆదాయం ఉన్న స్టేషన్లో అమాయకంగా బతకడమే అతనికి సీటుకు ఏసరూ తెచ్చేలా.. ఓ ముఠా పని పక్క ప్లాన్ తో చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు. గతం లో ఇలాంటి రెస్టారెంట్లు ఎన్నోసార్లు సమయానికి మించి మద్యం తాగిన వారికి పరిమిషన్ 24 గంటలు ఉన్న డ్రగ్స్ వాడినట్లు తెలిసినా ఉన్నతాధికారులు తెలిసీ తెలియని తెలీనట్లు వ్యవహరించారని వినికిడి.. కానీ ఈ సందర్భంగా ఒక భూతద్దంలో పెట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఐ ని సస్పెండ్ చేస్తూ.. మరో సి ఐ కి కావాలని పోస్టింగ్ ఇప్పించే లా వ్యవహారం తెరచాటున జరిగిందని విమర్శలు మొదలయ్యాయి. అందుకే ఈ పోస్టింగ్ వెనక రహస్య ఎజెండా లో పక్కా ప్రణాళికలు అమలు చేశారు.. ఎవరికి ఏది ఇస్తే … ఏమారిస్తే ఏది వస్తుందో వెన్నతో పెట్టిన విద్యావంతుడికి అలాంటి స్టేషన్ దొరికింది అని ఆ బ్యాచ్ వాళ్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు బంజారా హిల్స్, జూబ్లీహిల్స్.. పిఎస్ లో SHO గా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి.. అవి లేకపోతే ఇలా జరుగుతుందని హెచ్చరించినట్లు లోకల్ మీడియా చెపుతోంది. చాలామంది కోరుకుంటున్న విధంగా నే వ్యవహారాన్ని రహస్య ఎజెండా గా నడిపించారని ఎన్నడూ లేనివిధంగా పోస్టింగ్ ల కోసం కూడా ఇంతకి దిగజారుతారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *