“రాహుల్”రహదారి ఎటు ??
- నాడు వృద్ధులు అని చీదరించుకొని…నేడు వారి అవసరం ఎలా?
- నాటి విమర్శకులు నేటి మద్దతు దారులా ?
- పరిణితి లేని నేత రాహుల్ ?
అనుకున్నట్లుగానే రాహుల్ గాంధీ లోక్ సభ్య సభ్యత్వాన్ని కోల్పోయాడు !
రాహుల్ కి ఇప్పుడు తన పార్టీలోని సీనియర్ నాయకుల అవసరం కనిపించింది హఠాత్తుగా !
ఇన్నాళ్ళూ ఈ వృద్ధులు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ మంకు పట్టు పట్టిన రాహుల్ కి అకస్మాత్తుగా తన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడే సరికి వాళ్ళ అవసరం కనిపించి,పిలిపించి మరీ మీటింగ్ పెట్టాడు !
అన్ని ప్రతిపక్షాలు కలిసి పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవన్ కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు !
14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టు తలుపు తట్టాయి : తమని అరెస్ట్ చేసేముందు ఎలా ప్రవర్తించాలో సిబిఐ,ED లకి గైడ్ లైన్స్ ఇవ్వాలని సుప్రీం కోర్టుకి వెళ్ళాయి. అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే వారం ముందే మిమ్మలని అరెస్ట్ చేస్తున్నాము అని సిబిఐ లేదా ED చెప్పాలి అన్నమాట !
రాహుల్ మొదలు పెట్టిన ప్రజాస్వామ్యం ప్రమాదం లాంటి పదాలు అనేవి అతని స్వంత పైత్యమ్ కాదు ! పశ్చిమదేశాల డ్రామాలో భాగంగా ఆ డైలాగులు రాహుల్ చేత చెప్పించాయి.
నేను తరుచూ చెప్తూ వస్తున్నాను పశ్చిమ దేశాల డ్రామా ఎలా ఉంటుందో అని ! తమకి సహకరించని దేశాధ్యక్షులని,ప్రధాన మంత్రులని కానీ తొలగించాలి అంటే ముందు ప్రజాస్వామ్యం అనే వస్తువుని అమ్మకానికి పెట్టి దానిని మార్కెట్ చేస్తాయి. చివరగా డెమొక్రసీ ని ఆయాదేశాలలో అమ్మేస్తాయి ! ఇలా డెమొక్రసీ ని అమ్మిన దేశాల జాబితా ఏమిటో చూడండి: ఇరాక్ – సద్దాం హుస్సేన్ , లిబియా – మహమ్మద్ గడాఫీ, ఆఫ్ఘనిస్తాన్ – నజీబుల్లా. ఈ మూడు దేశాలు ఇప్పటికీ సంక్షోభంలోనే ఉన్నాయి ! ప్రజాస్వామ్యం పేరుతో ఈ ముగ్గురూ దారుణంగా చంపబడ్డారు !
ఇరాన్ లో డ్రామాకి ఆయోతోల్లాహ్ ఖోమైనీ అడ్డుపడ్డాడు కాబట్టి వీళ్ళు అక్కడ డెమొక్రసీ ని అమ్మలేకపోయారు ! సిరియాలో అసద్ కి ఇరాన్,రష్యాలు అడ్డుపడడం వలన డెమొక్రసీ ని అమ్మలేకపోయారు! ఈజిప్ట్ లో కూడా డ్రామా మొదలుపెట్టి చివరకి ఈజిప్ట్ ఆయుధాలు కొంటామని హామీ ఇవ్వగానే వెనక్కి వెళ్లిపోయారు.
ఇజ్రాయెల్ దేశానికి ఆయుధాలు,డాలర్లు ఇచ్చి ప్రోత్సహిస్తూ మరో వైపు పాలస్తీనా కి ఐక్యరాజ్య సమితి ద్వారా సహాయం చేయిస్తారు ! ఇజ్రాయెల్ ఆయుధాలు ఖచ్చితంగా టార్గెట్ ని కొడుతున్నాయా లేదా అని పరీక్షించడానికి కృత్రిమ టార్గెట్ ల కంటే లైవ్ టార్గెట్ లు ముఖ్యం కాబట్టి పాలస్తీనా కి సహాయం చేస్తారు !
ఇక CNN సీనియర్ జర్నలిస్ట్ మరియు సిచుయేషన్ రూమ్ ఇంచార్జ్ అయిన వోల్ఫ్ బ్లీట్జర్ [ Wolf Blitzer] అయితే CNN లైవ్ షో పెట్టి మరీ భారత దేశ న్యాయస్థానం తనకి ఉరి శిక్ష వేసినంతగా బాధపడిపోతూ రాహుల్ కి అన్యాయం జరిగిపోయింది అంటూ తెగ ఆయాసపడిపోయాడు ! ఈ వోల్ఫ్ బ్లీట్జర్ కి అసలు రాహుల్ గురుంచి తెలిసింది తక్కువ కానీ తమ దేశ డ్రామా డైరక్టర్ ఆదేశించాడు కాబట్టి షో నిర్వహించాడు! బరాక్ ఒబామా !
నిన్న సూరత్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తన తీర్పుని ఇవ్వగానే వెంటనే స్పందించాడు బరాక్ ఒబామా! భారత దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య నిజమే అని అనిపిస్తున్నది అని వ్యాఖ్యానించాడు ఒబామా! అది సరే కానీ ఇంత హఠాత్తుగా రాహుల్ లో ఎలా మెచ్యూరిటీ కనిపించింది ఒబామాకి ? 2016 లో తన ఆటోబయోగ్రఫీ లో రాహుల్ గురుంచి వ్రాస్తూ అతనొక ఇమ్మేచ్యూర్ పొలిటీషియన్ లైక్ కమేడియన్ అని వ్రాసిన ఒబామా కి ఇప్పుడు రాహుల్ ఒక పరిణితి చెందిన ప్రజాస్వామ్య రక్షకుడిగా ఎలా కనపడ్డాడు ?
2024 లో రాహుల్ ని ప్రధాని పీఠం మీద కూర్చోపెట్టి తమ ఇష్టానుసారం ఆడుకోవాలి అనే సాలెగూడు లాంటి ప్లాన్ !
నిజానికి CNN కి కావొచ్చు లేదా ఇతర పశ్చిమ దేశాలకి కావొచ్చు రాహుల్ గురుంచి తెలిసింది చాలా తక్కువ ! రామ్ నామ్ సత్య హై లాంటి చివరి ఆశ వీళ్ళకి !
రాహుల్ ఎదుర్కొంటున్న కేసులు ఎన్ని ?
దాదాపుగా 11 లేదా 12 కేసులు ప్రస్తుతం కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి.
ఒక్క నేషనల్ హెరాల్డ్ కేసులో అంతర్గతంగా మూడు కేసులు నమోదు అయి ఉన్నాయి మరియు ఈ కేసులలో బెయిల్ మీద ఉన్నాడు రాహుల్ మరియు సోనియా లు.
- నేషనల్ హెరాల్డ్ పత్రిక షేర్లని వాటాదారులకి చెప్పకుండా ఏక పక్షంగా మొత్తం షేర్లని సోనియా,రాహుల్ పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసిన కేసు.
- మనీ లాండరింగ్ కేసు పెండింగ్ లో ఉంది. ఇది కూడా నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించినదే !
- నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉన్న కార్యాలయం ని అద్దెకి ఇచ్చి దాని మీద వచ్చే ఆదాయానికి పన్ను కట్టని కేసు!
- ఢిల్లీ లో ఉన్న నేషనల్ హెరాల్డ్ కార్యాలయం విషయం లో అక్రమంగా భూమిని కబ్జా చేసి కట్టారు మరియు ముంబై ,నాగపూర్,లక్నో లాంటి నగరాలలో అయితే నేషనల్ హెరాల్డ్ కార్యాలలని పూర్తిగా భూమి కబ్జా చేసి కట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసు వేసింది సుబ్రహ్మణ్య స్వామి.
- 2018 లో కోలార్ ఎన్నికల సభలో మోడీ ఇంటి పేరుకల వాళ్ళు అందరూ దొంగలే అన్న వ్యాఖ్య మీద పరువు నష్టం దావా కేసులో నిన్న శిక్ష పడింది !
- 2019 లో రాహుల్ అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కొ ఆపరేటివ్ బాంక్ నోట్ల రద్దు సందర్భంగా ఆక్రమాలకి పాల్పడ్డది అని ఆరోపణలు చేయడంతో ఆ బాంక్ పరువు నష్టం దావా వేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టుకి హాజరయ్యి బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు రాహుల్. ఈ కేసు కూడా త్వరలో విచారణకి రాబోతున్నది.
- జులై 04,2019 లో యాక్టివిస్ట్ గౌరీ లంకేష హత్య కేసులో బిజేపి-RSS లకి సంబంధం ఉంది అంటూ తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను RSS కార్యకర్త ఒకరు ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు దాని మీద కూడా ముంబై కోర్టుకి హాజరు అయ్యి బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు రాహుల్. గౌరీ లంకేష్ హత్య జరిగినప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం కానీ గౌరీ లంకేష హత్య కేసు మిస్టరీ వీడింది నిందితులని పట్టుకున్నారు. ఇది వామపక్ష పార్టీల మధ్య వచ్చిన బేదాభిప్రాయాల వల్ల వాళ్ళలో వాళ్ళే హత్యలు చేసుకున్నారు. ఈ కేసు కూడా విచారణలో ఉన్నది.
- నవంబర్,2016 లో రాహుల్ మాట్లాడుతూ గాంధీ ని హత్య చేసింది RSS అన్నాడు. దీని మీద మహారాష్ట్ర లోని భివాoడి కోర్టులో కేసు వేశాడు మరో RSS కార్యకర్త. దీని మీద సుప్రీం కోర్టుకి వెళ్ళాడు రాహుల్ కానీ సుప్రీం కోర్టు నాధురాం గాడ్సే విషయంలో ఢిల్లీ కోర్ట్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ని చదివి దానిలో ఎక్కడా RSS ప్రస్తావన లేదని అలాంటప్పుడు ఎలా ఆరోపణలు చేశారు అని ప్రశ్నించగా నేను విచారణ సమయంలో కోర్టుకి అన్ని ఆధారాలు ఇస్తాను అంటూ సమర్ధించుకున్నాడు రాహుల్. ఈ కేసు కూడా విచారణ దశలో ఉంది బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు రాహుల్.
- మరో కేసు అస్సాం లోని గౌహతి కోర్టులో విచారణలో ఉన్నది ఇది కూడా పరువు నష్టం దావా నె !డిసెంబర్ నెల 2015 లో అస్సాం లోకి నన్ను ప్రవేశించకుండా RSS అడ్డుకున్నది అంటూ రాహుల్ ఆరోపించాడు దీని మీద గౌహతి కోర్టులో కేసు వేశారు. 2016 లో ఈ కేసు విచారణకి వచ్చినప్పుడు రాహుల్ హాజరయ్యి బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు. ఇది కూడా పరువు నష్టం దావానే ! ఇది కూడా త్వరలో విచారణ పూర్తయ్యే దశలో ఉంది !
- భారత్ జోడో యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో తమని మానభంగం చేసారంటూ కొందరు మహిళలు తనని కలిసి చెప్పారని రాహుల్ తరువాత అన్నాడు. దీని మీద విచారణ జరుగుతున్నది. రాహుల్ మానభంగం విషయం లేవనెత్తినది లండన్ లో మన దేశంలో కాదు. దీని మీద కూడా కేసు నమోదు చేయనున్నారు ఢిల్లీ పోలీసులు. నిజంగానె జమ్మూ లో మహిళలు కలిసి తమని మానభంగం చేశారని రాహుల్ కి ఫిర్యాదు చేసినప్పుడే అక్కడికి దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ లో దగ్గర ఉండీ కేసు రిజస్టర్ చేయించి ఉంటే రాహుల్ ఆరోపణలకి బలం ఉండేది కానీ అది అబద్ధపు ఆరోపణ. అదీ లండన్ వెళ్ళి అక్కడ ఈ విషయం మాట్లాడం ఏమిటీ ?
2013 లో పార్లమెంట్,అసెంబ్లీ,విధాన సభ సభ్యులని అనర్హత వేటు నుండి కాపాడడానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ని తెచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్ అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ని కాపాడానికి నిర్దేశించింది కానీ దీని మీద రాహుల్ మండిపడుతూ ఆ ఆర్డినెన్స్ కాగితాలని బహిరంగంగానే చించేశాడు దాంతో దానిని వెనక్కి తీసుకుంది మన్మోహన్ ప్రభుత్వం !
అంటే 2013 లో స్వయంగా తానే తన శిక్షని ఖరారు చేసుకున్నాడు రాహుల్ ! అదే ఆర్డినెన్స్ కనుక అమలులో ఉన్నట్లయితే ఇప్పుడు అనర్హత వేటు బారిన పడకుండా ఉండేవాడు !
ఉన్నత పదవుల లో ఉన్నవాళ్ళని బోడి,సన్నాసి, లాంటి పదాలని తరుచూ వాడే KCR లాంటి వారికి రాహుల్ ఉదంతం ఒక హెచ్చరిక ! విమర్శించడం వేరు కించ పరచడం వేరు అని గుర్తుపెట్టుకోండి !
సమయం అనేది ఎవరి కోసమూ ఆగదు !
జైహింద్ ! జై భారత్ !