చిన్నారి చైత్యను పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ అమీర్ పేట్ ఎస్ ఆర్ టి లో ఎస్ ఆర్ నగర్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులు,యువతీయువకులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేసి ఉరి శిక్ష విధించాలని నినదించారు.