తలసానికి తప్పని తమ్ముళ్ల తలనొప్పి

తలసానికి తప్పని తమ్ముళ్ల తలనొప్పి

సాధారణంగా ఈ నాయకుడికైనా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల నుండి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ అధికార BRS పార్టీలో సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సొంత పార్టీలోని కొందరు తమ్ముళ్ళతో కొత్తరకమైన సమస్యలు ఎదురవుతున్నాయట.బయట ప్రత్యర్థి పార్టీల నేతల సంగతేమో గాని సొంత అనుచరుల ఆగడాలు తెలిసి తెలియక చేస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల జనాల్లో నెగిటివ్ ప్రభావం పడుతోందట.

తలసాని నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక అనుచరులు ఈమధ్య కొత్త ప్రచార పర్వానికి తెరలేపారట.. మంత్రి స్థాయిలో ఉండి తన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చిన తలసాని.గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ప్రభుత్వ పథకాలలో అనేకమంది లబ్ధిదారులు ఈ నియోజకవర్గం నుండి లాభపడ్డారు
. దీంతో ప్రజల్లో తలసాని అంటే ఉన్న అభిమానం ఇప్పటికీ కొనసాగుతోంది ఈసారి ఎన్నికల్లో గెలుపు కూడా నల్లేరు మీద నడకలాగే సాగుతుందని అనుకుంటున్న తరుణంలో ఇద్దరు అనుచరుల రహస్య భేటీలు నిర్వహించడమే కాదు.తలసానిని ఓడించడానికి అవసరమయ్యే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.సొంత పార్టీలో కుంపటి పెట్టే విధంగా వ్యవహరిస్తున్న వారిద్దరి శైలి ఇతర స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు.ఇక గెలుపు పక్కా అనుకున్న నియోజకవర్గం లో వారు తెరచాటు చేస్తున్న నెగిటివ్ ప్రచారం తలసాని కీలకమైన ఎన్నికలవేళ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

అయితే వ్యక్తిగతంగా తలసాని పై ఉన్న అభిమానం.అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఉన్న నమ్మకం వల్ల గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితులు అటు ఇటుగా మారితే అది ప్రత్యర్థి పార్టీల నాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉంది.ఈ విషయం శీనన్న గుర్తించకపోతే తమ్ముళ్లతో తలనొప్పులు తప్పవని నియోజకవర్గంలో ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *