మన‘మంత్రి’ గారి కర్రీ పాయింట్!

మన‘మంత్రి’ గారి కర్రీ పాయింట్!

అనగనగ ఒక కర్రీ పాయింట్…అది నగరంలోని సంజీవరెడ్డి నగర్ లో ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఆ ‘కర్రీ’లో ఏం కలుపుతారో తెలియదు కానీ..జనం ఎగబడతారు. దీంతో ప్రతి నిత్యం ఆ కర్రీల దుకాణం వద్ద వాహనాలు బారులు తీరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఏడాది నుండి స్థానికులు పదుల సంఖ్యలో ఈ సమస్యపై..ఈ కర్రీ పాయింట్‌పై ట్రాఫిక్ పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఈ సమస్యపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టలేదు. ఐతే మొన్నటికి మొన్న ఈ కర్రీ పాయింంట్ సమస్యపై ట్రాఫిక్ పోలీస్‌లపై తీవ్ర విమర్శలు రావడం, ఈ కర్రీ పాయింట్ సమస్యపై ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు అక్కడ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఆ కర్రీ పాయింట్ వద్దకు వెళ్లి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఇంకేముంది..వెంటనే సదరు స్థానిక ట్రాఫిక్ అధికారులకు మంత్రి గారి పీఏ అంటూ ఒకరు..ఆ కర్రీ పాయింట్ మనదే అంటూ స్థానిక అధికార పార్టీ నేతలు కొందరు ట్రాఫిక్ పోలీస్‌లకు ఫోన్ చేసి, దాని జోలికి పోతే బాగుండదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక మంత్రి గారి పీఏ అని చెప్పి ఆయన, ఏకంగా ‘ఆ కర్రీ పాయింట్ మంత్రి గారిది..దాని జోలికి పోవద్దు’ అని ట్రాఫిక్ పోలీసులకు దమ్కీ కూడా ఇచ్చినట్టు సమాచారం. దీంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు మంత్రి గారి పీఏ ఫోన్ కాల్ ‘హరి హర’ మేం ఏం చేయాలి ఇప్పుడు అని లోలోన మదనపడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆ నియోజక వర్గంలో మంత్రి గారు చేసిన పలు అభివృద్ధి పనుల వల్ల ఆయనకు చాలా మంచి పేరు ఉంది. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వెంటనే స్పదించే గుణం ఆయనది. అలాంటి మంచి మంత్రి పేరు చెప్పుకొని కొందరు కింది స్థాయి సిబ్బంది, కింది స్థాయి నేతల చర్యల వల్ల మంత్రి పేరు చెడి పోయే అవకాశం ఉంది. నేడు కర్రీ పాయింట్.

మంత్రి గారిది అంటారు..రేపు ఇంకా ఏమైనా చేసి మంత్రి గారి పేరు చెప్తారు అని కొందరు మంత్రి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గారు ఒక చిన్న కర్రీ పాయింట్ వివాదంలో జోక్యం చేసుకోరు అన్న విషయం ఆ హరిహర నాథుడికే తెలియాలి అని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాల్లో ఇలా మంత్రి పేరు చెప్పుకొని సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకోవడం తగదు అని స్థానికులు అంటున్నారు.

మన మంత్రి గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *