చికోటి పై ‘చీకటి’ కుట్ర
- “జై శ్రీరామ్” అనడమే పాపమా?
- రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి?
- చికోటికి అండగా ఉంటామంటున్న హిందువులు.
రాజకీయాలు అంటే మంచి చెడు అనేవి ఉండవని అందరికి తెల్సు,కానీ ధర్మం కోసం పోరాడేందుకు పొరపాటున రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేస్తే చాలు.కోట్ల కుంభకోణాలు చేసే పార్టీ నేతలకి సైతం నీతీ నిజాయితీలు గుర్తుకు వస్తాయి.ఎదుటి వాడిని తొక్కేయడానికి చిలక పలుకులు పలుకుతు, వారి వ్యక్తి గత జీవితాన్ని టార్గెట్ చేస్తూ తొక్కేయడానికి కుట్ర చేస్తారు.సరిగ్గా అదే జరుగుతుంది నేడు తెలంగాణలో చికోటి ప్రవీణ్ విషయంలో.
“జై రామ్”
గత కొద్ది నెలలుగా చికోటి ప్రవీణ్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఉద్దేశ్య పూర్వకంగానే కొన్ని అదృశ్య శక్తులు చికోటిపై కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది, ఎప్పుడు ఐతే చికోటి ప్రజల మధ్యకు వచ్చి “జై రామ్” అని తనకు హిందూ ధర్మంపై ఉన్న అభిమానాన్ని బయటకు చూపించాడో నాటి నుంచి చికోటిపై ఎదురు దాడి మొదలయింది. ఇక చికోటి రాజా సింగ్ ని కలవడం, హిందూ ధర్మ పరిరక్షణకు తాను పోరాడుతనని బహిరంగ ప్రకటన చేయడంతో అయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న ఊహగానాలు మొదలైయ్యాయి. దీనికి తోడు చికోటి ఎక్కడికి వెళ్లిన యువత ఆయనకు మద్దతుగా నిలవడం గమనార్హం, దీంతో పలువురి రాజకీయ నాయుకుల దృష్టి అయన మీద పడింది. అప్పటి నుండి అయన పై నిఘా సంస్థలు కూడా కన్నేసినట్టు తెల్సింది.
‘గజ్వేల్ వెళ్ళాక సీన్ మారింది’
ఇక గజ్వేల్లో జరిగిన ఘటనలో భాగంగా చికోటి అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తున్న హిందువులకు మద్దతు ప్రకటించారు. దీంతో అయనపై కొందరు కుట్రలు చేయడం మొదలెట్టారు. ఇదే అదునుగా భావించి బోనాల పండుగ సందర్బంగా మహంకాళి ఆలయానికి వెళ్లిన చికోటి అనుచురులపై, ఆయనపై కూడా అక్రమ కేసులు నమోదు చేశారు. చట్ట ప్రకారం ఆత్మరక్షణ కోసం పొందిన ఆయుధాలకు లైసెన్స్ లేవు అని ఒక సారి, రెన్యూవల్ చేయలేదు అని ఒకసారి ఆరోపణలు చేస్తూ ఆయన అనుచరులని ముగ్గురిని రిమాండ్ కి తరలించడమే కాకుండా చికోటిని ఆ కేసు లో ఏ1 గా చేర్చడంతో ఇది పూర్తిగా కుట్ర అని అర్ధం అవుతుంది. వాస్తవానికి చికోటి ఇప్పటి వరకు ఇప్పటి ప్రభుత్వంపై గాని, మరి ఏ ఇతర పార్టీలపై గాని, నేతలపై గాని విమర్శలు చేయలేదు. అసలు ఇప్పటికి రాజకీయాలపై చిన్న వ్యాఖ్యలు కూడా చేసినట్టు లేదు. ఇంత లోపే ఆయనపై కుట్రలు చేయడం వెనుక కారణాలు ఏంటో అంతు చిక్కని ప్రశ్న, కేవలం హిందూ ధర్మం కోసం పోరాడతాను అని చెప్పడమే చికోటి తప్పా అనిపిస్తుంది.
‘బురద చల్లే యత్నాలు’
ఇక ఒక వర్గం మీడియా చికోటిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. ఆయన వ్యాపారంపై, ఆయన వ్యక్తి గత జీవన శైలిపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఐనా ఆయన ఆ విమర్శలు ధైర్యంగా ఎదురుకుంటూ, తాను ఎక్కడ అక్రమ దందాలు చేయడం లేదు అని, పన్నులు చెల్లించి మరి వ్యాపారం చేస్కుంటున్నా అని బల్లగుద్ది మరి చెప్పి తన వ్యక్తిత్వన్ని చాటుకున్నాడు. తప్పు చేస్తే తన పై చట్టపరమైన చర్యలు తీసుకొమ్మని సవాలు విసిరాడు. ఇది నిజమే.. ప్రవీణ్ చేసిన, చేస్తున్న వ్యాపారం కేవలం చట్ట బద్దత ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నారు. ఇది చికోటి ప్రవీణ్ చేయకపోతె ఇంకొకరు చేస్తారు అన్న విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇక వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన చికోటికి కేవలం కాసినో ద్వార మాత్రమే సంపాదన లేదు. ఆయన కొనుగోలు చేసిన భూముల విలువ పెరిగి ఆయనని ఆర్థికంగా బలపడేందుకు కారణం అయ్యాయి అని చెప్పవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ప్రజల సొమ్మును దండుకుంటూ, కోట్ల స్కాంలు చేసిన నేతల కంటే బహిరంగంగా చట్ట ప్రకారం వ్యాపారం చేస్తున్న చికోటి అందరి కంటే మేలు అన్న విషయాన్ని గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా హిందూ ధర్మం కోసం పోరాడ్తున్న చికోటిపై జరుగుతున్న కుట్రను ఆదిలోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం చికోటిపై జరుగుతున్న దాడిగా భావించకుండా హిందువులపై జరుగుతున్న దాడిగా భావించాల్సిందే. జై శ్రీరామ్ అంటూ మరింత ముందుకు సాగాల్సిందే…