అంతా “ఆయనే “చేసారు
- బెడిసి కొట్టిన అపాత్ర ” దానం “.
- చెక్ పెట్టేందుకు సీరియస్ చర్యలు..?
- దానం దెబ్బకి ముగ్గురు సీఐలు బలి.
అపాత్ర దానం మంచిది కాదని మొదటి నుండి మన పెద్దలు హితబోధ చేస్తుంటారు. దీని అర్థం ఇప్పుడు ఓ నేతకు స్పష్టంగా తెలిసి వచ్చినట్టుంది.
మన కులపొడే కదా అని ఓ పోలీసు అధికారిని నెత్తిన పెట్టుకున్న సదరు రాజకీయ నాయకుడికి ఆ సీఐ చేసిన వ్యవహారం తలనొప్పిగా మారింది.. గతంలో పలు ఆరోపణలు ఉన్నప్పటికీ సిటీలో వివిఐపీలు, సెలబ్రిటీలు, కీలక వ్యాపార వర్గాలకు చెందినవారు నివాసముండే బంజరాహిల్స్ లాంటి పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు.. ఇది కూడా అంత ఈజీగా జరిగిందేమీ కాదు.. పలు ఇంటెలిజెన్స్ రిపోర్టులు సదరు అధికారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఏకంగా డిజిపి స్థాయిలో ప్రెషర్ తెచ్చి మరి కుర్చీలో కూర్చోబెట్టారు అంతవరకు బాగానే ఉంది… ఇక మంచి పోస్టింగ్ దక్కడంతో ఆ సీఐ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.. ప్రైవేట్ మాఫియాతరహాలు వసూళ్ల పర్వానికి తెరతీసి రోజుకు లక్షలు కళ్ళ చూడందే ఇంటికి వెళ్లడని ఆ స్టేషన్ గురించి తెలిసిన వాళ్ళు బహిరంగంగానే చర్చించుకున్నారు.. ఇక అనధికార దందాలకు మరింత బూస్టింగ్ ఇస్తూ అదే రేంజ్ లో నెలవారి మామూళ్లు వసూలు చేసి బాగానే వెనకేసాడని తెలిసింది.
అయితే ఇంతవరకు బాగానే నడిచిన వ్యవహారం ఓ పబ్బు కోసం చేసిన గబ్బు పని తో రచ్చ మొదలైంది. ఏసీబీ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని ఎన్నడూ లేని విధంగా సిఐ తో పాటు ఎస్సై హోంగార్డు లను అదుపులోకి తీసుకొని రోజంతా విచారించడం పోలీసు వర్గాలు కలకలం రేపింది. అయితే తమ వాడిని వదిలివేయాలంటూ ప్రస్తుతానికి సస్పెన్షన్‌తో సరిపుచ్చాలంటూ పోస్టింగ్ దానం ఇచ్చిన నేత పలుమార్లు ఉన్నతాధికారులను సంప్రదించాడు. అతని మాటను ఏమాత్రం పట్టించుకోని ఉన్నతాధికారులు కఠిన చర్యలు దిశగా వెళుతుండడం ఆ నేత చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలని అదుపులో పెట్టడానికే అని తెలుస్తుంది. సిటీలో ఎంత పట్టు ఉన్నా ఇలాంటి అధికారుల విషయంలో అతిగా జోక్యం చేసుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయని తమ చర్యల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు సదరు నేతకు తెలిసేలా చేస్తున్నారని ఆ నేత సన్నిహితులే అంటున్నారు. తీవ్ర ఆరోపణలు ఉన్న అధికారిని తన వాడంటూ నెత్తిన పెట్టుకున్న పాపానికి ఇప్పుడు లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్న అని ఆ నేత తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.
ఏది ఏమైనా ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేత ప్రాధాన్యతని తగ్గించడానికి ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. కానీ ఆ అధికారి వ్యవహార శైలి తెలిసిన వారు ఏదో ఒక రోజు ఇలాంటివి జరుగుతుందని ముందే ఊహించామని అంటున్నారు.
“దానం” దెబ్బకు ముగ్గురు సీఐలు ఫట్ :
దానం జోక్యం చేసుకున్న మూడు వ్యవహారాల్లో ముగ్గురు అధికారులు సస్పెండ్ కావడం బదిలీ కావడం, ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాడిసన్ బ్లూ వ్యవహారంలో శివచంద్ర అనే సీఐ సస్పెండ్ కాగా, ఓ సివిల్ భూ తగాదాలో మంత్రికి వ్యతిరేకంగా పనిచేశాడని నాగేశ్వరరావు అనే మరో సీఐని బలవంతంగా బదిలీ చేశారు. ఇక ముచ్చటగా మూడో దెబ్బ ప్రస్తుత సీఐ నరేందర్ కి పడింది. వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేరు మార్మోగేలా చేసింది.
By ఎన్.మల్లేష్ ( వార్త ).