ప్రజల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణే ధ్యేయం


ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా బయో టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని శ్రీ రంగ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డి.ఎన్.ఎం రాజు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రిఫ్లా హెర్బల్ పౌడర్ , శ్రిఫ్లా ఎస్ ఎఫ్ హెర్బల్ పౌడర్ అనే బయో టెక్నాలజీ ఉత్పత్తులను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. శ్రిఫ్లా హెర్బల్ పౌడర్, శ్రిఫ్లా ఎస్ ఎఫ్ హెర్బల్ పౌడర్ విడుదల చేసిన వెంటనే బహుళ ప్రజాదరణ పొందాయని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయోత్సవ వేడుక నిర్వహిస్తూ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ రెండు ఉత్పత్తులు జీర్ణక్రియను మెరుగు పరిచి గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, మలబద్దకం, అజీర్ణం, మొలలు, ఆకలి లేమి వంటి సమస్యల నుండి అతి తక్కువ సమయంలో విముక్తి కలిగిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్పత్తులను వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమె స్పష్టం చేశారు. శ్రిఫ్లా హెర్బల్ పౌడర్ ను యాలకలు, ఉసిరి , కరక్కాయ, తానికాయ మిశ్రమంతో తయారు చేస్తామని తెలిపారు. శ్రిఫ్లా హెర్బల్ పౌడర్ లో ఉన్న ఉసిరి, కరక్కాయ, తానికాయ వంటి పండ్ల యొక్క పౌడర్ ను వేలాది సంవత్సరాల నుంచి భారత దేశంలో ‘త్రిఫల’ అనే ఔషధం లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ పండ్లలో విటమిన్ సి , డి , బీటా కేరోటిన్ , జింక్, ఐరన్ మరియు సెలీనియం వంటి అనేక పోషక విలువలు ఉన్నాయని అన్నారు. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వాళ్ళ చర్మకాంతి పెరుగుట, కొలెస్టరాల్ తగ్గుట, అధిక బరువు తగ్గుట వంటి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ విరివిగా ఉండడం వల్ల ఇది కాన్సర్ కారకాలైన రసాయనాలను తొలగిస్తుందని తెలిపారు. శ్రిఫ్లా ఎస్ ఎఫ్ హెర్బల్ పౌడర్ చక్కర రహితమైనదని, ఇది డయాబెటిస్ బాధితులు వాడడానికి అనువైనదని పేర్కొన్నారు. శ్రిఫ్లా హెర్బల్ పౌడర్ యాలుక్కాయ ఫ్లేవర్ లో 10గ్రాముల ప్యాకెట్ లలో లభిస్తుందని, పది సాచెట్ల బాక్స్ రూ. 120కి అందిస్తున్నట్లు చెప్పారు. రాత్రి భోజనం తరువాత ఒక ప్యాకెట్ పౌడర్ ను ఒక గ్లాస్ నీటితో తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020 ఆగష్టు 11న కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించిందని, అక్టోబర్ 25 నుంచి మార్కెటింగ్ చేస్తుందని తెలిపారు. తమ ఉత్పత్తులు అమెజాన్ , ఫ్లిప్ కార్ట్, వన్ ఎంజి వంటి ఈ-కామర్స్ సంస్థల ద్వారా కూడా పొందే అవకాశం ఉందని చెప్పారు. ఇతర సమాచారం కోసం 7997110608, 9246824078 ద్వారా మరియు తమ వెబ్ సైట్ www.sreerang.in లో తెలుసుకోవచ్చని అన్నారు. విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు జినుగు ప్రవీణ్ రెడ్డి, తాళ్లూరి వేణుగోపాల్ తో పాటు పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *